అన్వేషించండి

YS Jagan: ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్

YS Jagan Latest Comments: షర్మిలతో ఉన్న ఆస్తి తగాదాలు, లేఖల అంశంపై వైఎస్‌ జగన్ స్పందించారు. ఇది ప్రతి ఇంట్లో ఉన్న వ్యవహారమే అంటూ చెప్పుకొచ్చారు. ఇది ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్‌గా విమర్శలు చేశారు.

Jagan Comments At Gurla In Vizianaaram: వైఎస్‌ ఫ్యామిలీలో జరుగుతున్న ఆస్తులు అంతస్తుల సీరియల్‌పై వైఎస్ జగన్ స్పందించారు. ప్రతి ఇంట్లో జరుగుతున్న విషయాలనే ఏదో జరిగి పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రజా సమస్యలపై పోరాడుతుంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికే ఇలాంటి కుయుక్తులు ప‌న్నుతున్నారని మండిపడ్డారు. 

విజయనగరం జిల్లా గుర్ల గ్రామాన్ని సందర్శించిన జగన్... అతిసారంతో ముృతి చెందిన వ్యక్తుల ఫ్యామిలీలను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నా ఏదో విషయంపై ప్రచారం చేసి డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. అప్పట్లో లడ్డూ వ్యవహారం, మదనపల్లి కేసు ఇలాంటిదేనన్నారు. 

తాజాగా తాను గుంటూరు, గుర్ల గ్రామాలకు వెళ్తున్నానని చెప్పి తన తల్లి, చెల్లి, తన ఫొటోలతో ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది తన ఇంట్లోనే కాదని ప్రతి ఇంట్లో కూడా జరుగుతున్న వ్యవహారమే అన్నారు. ఘర్ ఘర్‌ కా ఖాహానీయే అంటూ చెప్పుకొచ్చారు. ఇంత చిన్న విషయాన్ని రంగులద్దీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జగన్ ఏమన్నారంటే..." ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాల్సిన వచ్చినప్పుడు చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అంతే కాకుండా ప్రతి టాపిక్‌పై డైవర్ట్ చేస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల జీవితాలు చెల్లాచెదురు అవుతున్నాయి. శాంతి భద్రతలు కుదేలు అయిపోయాయి. ఎక్కడ చూసిన టీడీపీ సానుభూతిపరులు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. దీనిపై జగన్ పోరాడుతున్నాడు... టీడీపీ చేస్తున్న అన్యాయాలు బయటకు తీస్తున్నాడు. గుంటూరు వెళ్తున్నాడు, బద్వేలు వెళ్తున్నాడు. గుర్ల గ్రామానికి వస్తున్నాడు... ఇక్కడ 14 మంది చనిపోయిన ప్రబుత్వం పట్టించుకోలేదు. దీంతో టాపిక్ డైవర్ట్ చేశారు. ఈసారి చెల్లెలు, అమ్మ, నా ఫొటో పెడుతున్నారు. 

మీ ఇళ్లల్లో ఇలాంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతున్నాను... ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. నీ స్వార్థం కోసం పెద్దవి చేసి చూపించడం, నిజాలు లేకపోయిన వక్రీకరించి చూపుతున్నారు. ప్రజలకు జరుగుత్న అన్యాయంపై ధ్యాసం పెట్టండి చంద్రబాబు, కష్టాల్లో పాలు పంచుకోండి. అని జగన్ ఆరోపణలు చేశారు. 

ఇలాంటి వాటిపై ప్రచారాన్ని తగ్గించి ప్రజా సమస్యలపై మాట్లాడాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజలు పడుతున్న బాధలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై స్పందించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు సవాల్ చేశారు జగన్. అంతే కానీ తన ఇంటి విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయొద్దని సూచించారు. 

Also Read: నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
Telangana News: తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
Jagan Wrote A Letter To Sharmila: నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరంఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యంమామునూర్‌లో పోలీసులపై పోలీస్ కుటుంబాల నిరసన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
ఘర్‌ ఘర్‌ కా ఖహానీ - షర్మిలతో ఆస్తి తగాదాలపై స్పందించిన జగన్
Telangana News: తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
Jagan Wrote A Letter To Sharmila: నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
Ongole News: తల్లితో సహజీవనం - కూతురుతో జంప్‌- ఒంగోలులో దారుణం
తల్లితో సహజీవనం - కూతురుతో జంప్‌- ఒంగోలులో దారుణం
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
Cyclone Dana Rains Update: నేడు తీవ్ర తుఫానుగా మారనున్న దానా- ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి
నేడు తీవ్ర తుఫానుగా మారనున్న దానా- ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి
AP Free Gas Cylinder: దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
Embed widget