ఉత్తరాంధ్ర సమస్యలపై విశాఖలో చర్చా వేదిక - పాల్గోనున్న టీడీపీ, జనసేన నేతలు
ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం కావాలో అనే అంశంతో విశాఖ వేదికగా చర్చా వేదిక జరగనుంది. కొణతాల రామకృష్ణుడు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.
విశాఖ లో ఉత్తరాంధ్ర చర్చా వేదిక
విశాఖలోని దశపల్ల హోటల్‌లో ఉత్తరాంధ్ర ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు అనే అంశం పై చర్చావేదిక జరుగనుంది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి జనసేన నాదెండ్ల మనోహర్, లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ, సీపీఐ రామకృష్ణ, కాంగ్రెన్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఎం శ్రీనివాసరావు, టీడీపీ అయ్యన్నపాత్రుడు, ఉత్తరాంధ్ర సిద్ధాంత కర్త ప్రొఫెసర్ చలం తదితరులు హాజరుకానున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఈ సమావేశం జరగనుంది.
వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక మళ్ళీ మార్పు
విశాఖలో రేపు జరగనున్న వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక మళ్లీ మారింది. ముందుగా ఆర్కే బీచ్‌లో ఈ వేడుక జరపాలని భావించినా దానిని ఏయూ గ్రౌండ్‌లో జరుపుకోవాలని అధికారులు ఆదేశించారు. దానికి ఏర్పాట్లు జరుగుతుండగా మళ్లీ ఆర్కే బీచ్‌లోనే జరుపుకోవచ్చని అనుమతులు వచ్చాయి. దానితో హడావుడిగా ఏర్పాట్లు మొదలు పెట్టారు నిర్వాహకులు.
తిరుమల సమాచారం
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది.. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం నువ్వుల గింజలతో ప్రసాదంను నివేదిస్తారు అర్చకులు. శుక్రవారం రోజున 45,887 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 17,702 మంది తలనీలాలు సమర్పించగా, 4.53 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు..