By: ABP Desam | Updated at : 05 Dec 2022 09:18 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
జీ 20 సదస్సు నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు సీఎం వైఎస్ జగన్. మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.15 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 5.00 – 7.00 ల వరకు రాష్ట్రపతి భవన్‌లో జీ 20 సదస్సు నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7.55 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నేడు ఢిల్లీకి పయనం కానున్నారు. రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అక్కడ ఆయన పదాధికారుల సమావేశంలో సోము వీర్రాజు పాల్గొంటారు. దానితో పాటే ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర బీజేపీ చెబుతోంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు కేంద్ర మంత్రులకు వివరించే విధంగా ఢిల్లీ టూర్ ను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు.
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.మధ్యాహ్నం ఢిల్లీ చేరుకునే ఆయన సాయంత్రం 5 నుండి7 గంటల వరకూ G-20కి చెందిన సదస్సు లో పాల్గొంటారు.
తిరుమలలో కొనసాగుతున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన. ఈరోజు ఉదయం 9.25 నిమిషాలకి క్షేత్ర సంప్రదాయ ప్రకారం భూవరాహ స్వామిని దర్శించుకోనున్న ద్రౌపతి ముర్ము అనంతరం శ్రీవారిని దర్శించుకొంటారు. శ్రీవారి దర్శనం అనంతరం పద్మావతి అతిథి గృహం చేరుకొని సేదతీరనున్న రాష్ట్రపతి ఉదయం 10.50 గంటలకు తిరుమల నుంచి తిరుగుప్రయాణం అవుతారు. 11.35 గంటలకు అలిపిరి గో మందిరం వద్ద ప్రత్యేక పూజలు చేసి 11.55 గంటలకు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం చేరుకొని అక్కడ విద్యార్థిని లతో మాట్లాడతారు..మధ్యాహ్నం 12.50 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి బయలుదేరానున్న రాష్ట్రపతి 1.00 గంటకు అమ్మవారి దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని ఏపీ నుండి తిరిగి వెళతారు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.
మూడు రాజధానులకు మద్ధతుగా కర్నూలులో రాయలసీమ గర్జన పేరుతో సోమవారం జరగనుంది. ఈ గర్జనకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీతోపాటు వైసీపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన గర్జనల కంటే జనసేమీకరణ చేయాలని చూస్తున్నారు. ఆదివారం రాత్రి దీనికి సంబంధించిన ఓ వీడియోను కొండారెడ్డి బురుజుపై ప్రదర్శించారు. దీనికి వైసీపీ లీడర్లు, జేఏసీ నేతలు హాజరయ్యారు.
Anil Kumar on Kotamreddy : కోటంరెడ్డి మహానటుడు, సావిత్రి కన్నా బాగా నటించగల వ్యక్తి- అనిల్ కుమార్ సెటైర్లు
Kakinada Crime: బాలిక సజీవ దహనం కేసులో సంచలన తీర్పు - నిందితుడికి జీవిత ఖైదు, భారీ జరిమానా
Srikakulam: ఏ చింత లేకుండా, చీపుర్లు చేసి రాణిస్తున్న సీతానగరం వాసులు
Konaseema District News: లంక అందాలను రెట్టింపు చేస్తున్న పొద్దుతిరుగుడు పంట - ఫొటోల కోసం ఎగబడుతున్న జనాలు
స్పందనకు అప్ డేట్ వెర్షన్ వచ్చేసింది - వినతుల పరిష్కారం కోసం జగనన్నకి చెబుదాం
YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్