News
News
X

AP News Developments Today: రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో అధికారుల బిజీ బిజీ - కీలక నేతలంతా నేడు విజయవాడలోనే

AP News Developments Today: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పర్యటన సహా కీలకమైన అప్‌డేట్స్ ఇవాళ చూడొచ్చు.

FOLLOW US: 
Share:

AP News Developments Today: 

రాష్ట్రపతి పర్యటన నేపథ్యం లో అధికారుల బిజీ :

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించనున్నారు. అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. కొత్త సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికే పలుదఫాలు సమీక్షలు నిర్వహించారు. రేపు విశాఖలో జరిగే నేవీ డే ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం  తిరుపతిలోనూ పర్యటిస్తారు. ముందుగా సీఎం జగన్ రాష్ట్రపతికి విజయవాడలో ఆహ్వానం పలుకుతారు. అనంతరం ఆమె విశాఖ చేరుకుంటారు. 

నేడు కేఆర్‌‌ఎంబీ రిజర్వాయర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కమిటీ (ఆర్‌‌ఎంసీ) చివరి సమావేశం 

ఉదయం 11 గంటలకు జలసౌధలో జరిగే సమావేశానికి సభ్యులు హాజరు కావాలని కన్వీనర్‌‌ రవికుమార్‌‌ పిళ్లై ఇప్పటికే బోర్డు నుంచి లేఖలు రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్టుల ఆపరేషన్‌‌ అండ్‌‌ మెయింటెనెన్స్‌‌ (రూల్‌‌ కర్వ్స్‌‌), పవర్‌‌ జనరేషన్‌‌, ప్రాజెక్టులన్నీ నిండి సముద్రంలోకి నీళ్లు వృథాగా పోతున్న రోజుల్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కింపుపై వివాదాలు పరిష్కరించేందుకు ఆర్‌‌ఎంసీని ఏర్పాటు చేశారు. జూన్‌‌లో జరిగిన రెండు సమావేశాలకు తెలంగాణ డుమ్మా కొట్టింది. ఆ తర్వాత జరిగిన మరో రెండు సమావేశాలకు అటెండ్‌‌ అయినా తెలంగాణ అభిప్రాయాలకు ఆర్‌‌ఎంసీ రికమండేషన్స్‌‌లో చోటు దక్కలేదు. ఐదో సమావేశం నిర్వహణకు బోర్డు పలుమార్లు తేదీలు నిర్ణయించినా అటెండ్‌‌ అయ్యేందుకు తెలంగాణ ససేమిరా అన్నది. పలు కారణాలతో ఏపీ సైతం కొన్నిసార్లు రాలేమని చెప్పింది. దీంతో బోర్డు ఐదో సమావేశం నిర్వహించి మీటింగ్‌‌కు రెండు రాష్ట్రాల సభ్యులెవరూ హాజరుకాలేదని కేంద్ర జలశక్తి శాఖకు సమాచారం ఇచ్చింది. ఆర్‌‌ఎంసీ ఆరో (చివరి) సమావేశానికి 2 రాష్ట్రాల సభ్యులు హాజరుకాకుంటే ఆర్‌‌ఎంసీ ఫెయిలైట్టుగానే భావించాల్సి వస్తుందని, అందుకే సభ్యులంతా చివరి మీటింగ్‌‌కు రావాలని కొన్ని రోజుల క్రితం కన్వీనర్‌‌ లేఖలు రాశారు.

కీలకనేతలంతా నేడు విజయవాడ లోనే :

ఏపీలోని కీలక నేతలు సీఎం జగన్ , చంద్రబాబు నాయుడు ,సోము వీర్రాజు తదితరులంతా నేడు విజయవాడ ,అమరావతిలోనే గడపనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాద్ లో ఉన్నారు .

5 న అల్పపీడనం .. 7న వాయుగుండం 
ఈ నెల 5 న ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది . ఇది 7 వతేదీ కల్లా వాయుగుండంగా మారి తమిళనాడు ,పుదుచ్చేరి తీరం వైపునకు దూసుకు రానున్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని కారణంగా  8,9 తేదీల్లో రాయలసీమ ,కోస్తాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు . వాతావరణం లోని మార్పులు కారణంగా రానున్న మూడు నెలలు అంటే ఫిబ్రవరి వరకూ వరుస తుఫానులు రానున్నట్టు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు . 

Published at : 03 Dec 2022 08:24 AM (IST) Tags: AP Latest news Telugu News Today AP News Developments Today AP Headlines Today

సంబంధిత కథనాలు

Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!

Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!

Sajjala Rama Krishna Reddy : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చంద్రబాబు స్కీం, కోటంరెడ్డి పాత్రధారి మాత్రమే - సజ్జల

Sajjala Rama Krishna Reddy : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చంద్రబాబు స్కీం, కోటంరెడ్డి పాత్రధారి మాత్రమే - సజ్జల

Satysai District Crime News: సత్యసాయి జిల్లాలో దారుణం - ఆరో తరగతి విద్యార్థినిపై యువకుడి అత్యాచార యత్నం

Satysai District Crime News: సత్యసాయి జిల్లాలో దారుణం - ఆరో తరగతి విద్యార్థినిపై యువకుడి అత్యాచార యత్నం

ఏందయ్యా ఇది-నువ్వు కూడానా? ఉదయగిరి ఎమ్మెల్యేకు మంత్రి కాకాణి క్లాస్!

ఏందయ్యా ఇది-నువ్వు కూడానా? ఉదయగిరి ఎమ్మెల్యేకు మంత్రి కాకాణి క్లాస్!

దమ్ముంటే వెంకటగిరి వచ్చి పోటీ చెయ్- ఆనం రాంనారాయణ రెడ్డికి నేదురుమల్లి సవాల్

దమ్ముంటే వెంకటగిరి వచ్చి పోటీ చెయ్- ఆనం రాంనారాయణ రెడ్డికి  నేదురుమల్లి సవాల్

టాప్ స్టోరీస్

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

ఇమేజ్‌ డ్యామేజ్ చేస్తే డొక్క పగలదీస్తాం- దుట్టా, యార్లగడ్డకు వంశీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఇమేజ్‌ డ్యామేజ్ చేస్తే డొక్క పగలదీస్తాం- దుట్టా, యార్లగడ్డకు వంశీ స్ట్రాంగ్ వార్నింగ్!

Inaya Sultan: తాజ్ మహల్ ముందు బిగ్ బాస్ బ్యూటీ పోజులు

Inaya Sultan: తాజ్ మహల్ ముందు బిగ్ బాస్ బ్యూటీ పోజులు