AP News Developments Today: కుప్పంలో పాదయాత్ర హడావుడి- విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవం
లోకేష్ పాదయాత్రలో పాల్గొని హార్ట్ ఆటాక్‌తో ఆసుపత్రి పాలైన సినిమా హీరో తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
1)కుప్పంలో కాసేపట్లో నారా లోకేష్ రెండో రోజు యువ గళం పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. గుడుపల్లె మండలం బెగ్గిపల్లెలో గ్రామస్తులతో సమావేశం కానున్నారు. కడపల్లెలో టిడిపి సీనియర్ నేతల ఆశీర్వాదo తీసుకోనున్నారు లోకేష్. కనుమల దొడ్డిలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ, ముఖాముఖిగా మాట్లాడనున్నారు. కనుమలదొడ్డిలో భోజన విరామం తీసుకుంటారు. పార్టీ నేతలతో సమావేశమవుతారు. తుమ్మిశి చెరువు సమీపంలో పలమనేరు - కుప్పం జాతీయ రహదారి పక్కన రాత్రి బస చేస్తున్నారు.
సూర్యప్రభ వాహనంతో మొదలైన రథసప్తమి వేడుకలు..
తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యని వాహనంగా అధిరోహించి భక్తులను కటాక్షించారు మలయప్ప స్వామి. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.. తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమల వీధులు చేరుకుని గోవిందుడికి మంగళ హారతులు పలికారు.. రథసప్తమి వేడుకల్లో ప్రథమ వాహనంగా సూర్య నారాయణుడు సూర్య ప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు.
3) ఇంకా విషమంగానే తారక రత్న ఆరోగ్య పరిస్థితి.
లోకేష్ పాదయాత్రలో పాల్గొని హార్ట్ ఆటాక్‌తో ఆసుపత్రి పాలైన సినిమా హీరో తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయకు కుప్పం పీఈస్ హాస్పిటల్ నుంచి బెంగుళూరుకు తరలించిన చికిత్స అందిస్తున్నారు. రెండు ప్రత్యేక అంబులెన్స్ లో తారకరత్న ను తరలించిన నారాయణ హృదయాలయ హాస్పిటల్ సిబ్బంది. అత్యధునిక పరికరాలతో కూడిన అంబులెన్స్‌లో తరలించారు.
4) విశాఖ శారదా పీఠానికి వీఐపీ ల రాక
విశాఖ శారదాపీఠంలో వైభవంగా వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి షెడ్యూల్ ఇదే
ఉదయం : 7.30 గంటలకు దేవతామూర్తుల ఆలయాల సందర్శన
ఉదయం : 8.30 గంటలకు రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు
ఉదయం : 8.45 గంటలకు అరుణ పారాయణ, సౌర హోమం
ఉదయం 9.00 గంటలకు రాజశ్యామల యాగం
ఉదయం : 9.15 గంటలకు శ్రీనివాస చతుర్వేద హవనం
ఉదయం : 9.30 గంటలకు పంజాబ్ గవర్నరు బన్వర్ లాల్ పురోహిత్ రాక
ఉదయం : 10.00 గంటలకు చాత్తాద వైష్ణవ ఆగమ సదస్సు
ఉదయం : 10.30 గంటలకు పర్యాటక శాఖ మంత్రి రోజా రాక
సాయంత్రం : 05.30 గంటలకు నిత్య పీఠపూజ
సాయంత్రం : 06.00 తమిళనాడు గవర్నరు రవీంద్ర నారాయణ రాక
సాయంత్రం : 06.30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు
రాత్రి : 07.00 గంటలకు రాజశ్యామల అమ్మవారికి మహా మంగళ హారతి
5) ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలపై ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ భేటీ విజయవాడలో నేడు జరగనుంది. నగరం లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉదయం 11 గంటలకు సమావేశం .