AP News Developments Today: ఏపీలో మెయిన్ అప్‌డేట్స్ ఇవే!
జీవో నెంబర్1పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
![AP News Developments Today: ఏపీలో మెయిన్ అప్‌డేట్స్ ఇవే! Top Andhra Pradesh News Developments Today 23 January CM jagan chandra babu Pawan kalyan Janasena TDP News Lokesh ABP Desam | Today's Agenda AP News Developments Today: ఏపీలో మెయిన్ అప్‌డేట్స్ ఇవే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/23/751af6aa3fc9c7fa0c57ccbd99fee6fe1674447987694215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జీవోనెంబర్1పై ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. సీపీఐ నేత రామకృష్ణసహా ఇతరులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. అటు ప్రభుత్వం, ఇటు పిటిషనర్ల తరఫున వాదనలు విననుంది కోర్టు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా యువగళం పాదయాత్ర విజయవంతం కావాలంటూ తెలుగుదేశం నేతలు వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తున్నారు. పూజలు చేస్తున్నారు. ఇవాళ పున్నమిఘాట్‌లో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు.
నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా వైజాగ్ టీడీపీ కార్యాలయం లో రక్తదానం నిర్వహించనున్నారు.
తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టిటిడి రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున 72,998 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 24,852 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 4.51 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 02 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)