AP News Developments Today: జగన్ పుట్టిన రోజు కానుకగా విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ
ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా పలు కార్యక్రమాలకు వైసీపీ, ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది.
విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ
సీఎం జగన్ ఇవాళ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లవల్లిలో పర్యటిస్తారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 11 గంటలకు యడ్లవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు 8 వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తారు.
పీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా యడ్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉదయం 11 గంటలకు జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 21న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. డిసెంబరు 22 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. వీరితోపాటు 59,176 మంది ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు డిసెంబరు 17న ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.
ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. వారితోపాటుగా ఉపాధ్యాయులకూ ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. పాఠాలు చెప్పేందుకు వీలుగా ఉంటుందని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ట్యాబ్‌లు అందిస్తారు. ప్రభుత్వం రూ.686 కోట్లతో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందించనున్నారు. రాష్ట్రంలోని 9,703 పాఠశాలల్లోని 4.50 లక్షల మంది విద్యార్థులు, 50,194 మంది ఉపాధ్యాయులు బైజూస్ నుండి కంటెంట్‌తో లోడ్ చేసిన Samsung T220 Lite Tablet PCని పొందనున్నారు.
జగన్ జన్మదిన వేడుకలు
సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు వైసీపీ పిలుపునిచ్చింది. మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని శ్రేణులకు సూచించింది. అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటుతున్నారు. రెడ్ క్రాస్ సంస్థతో కలిసి పెద్ద ఎత్తున రక్తదానం చేయనున్నారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నారు. సోమవారం పెద్ద ఎత్తున క్రీడాపోటీలు నిర్వహించారు. రెండో రోజు మంగళవారం మొక్కలు నాటారు. మూడో రోజు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేయనున్నారు.
క్రీడా సంబరాల ఫైనల్స్
రాష్ట్రంలో జగనన్న క్రీడా సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఇవాళ విజయవాడ కేంద్రంగా పైనల్స్ జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జోన్లలో నియోజకవర్గ స్థాయి పోటీలను నిర్వహించింది. కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటరరన్, క్రికెట్‌లో 11, 640 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. దీని కోసం ప్రభుత్వం 54.24 లక్షలు కేటాచింయించింది. తుది పోటీల్లో ఒక్కో జోన్ నుంచి 198 మందిని ఎంపికయ్యారు. ఫైనల్ పోటీల్లో 552 మంది తలపడనున్నారు.
అప్సా ఎన్నికలు
సచివాలయ ఉద్యోగుల సంఘం అప్సా ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. అప్సా ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. అమరావతి సచివాలయంలోని మూడో బ్లాక్‌లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మైసూర్, మంగుళూరులో ఏపీ పుర, నగరపాలక సంస్థల కమిషనర్లు
ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలపై పుర, నగరపాలక సంస్థల కమిషనర్లు, స్వచ్ఛాంధ్ర సంస్థ అధికారులు మైసూరు, మంగుళూరులో పర్యటించనున్నారు. ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు సాగనుందీ పర్యటన. పన్నెండు మంది పుర, నగరపాలక కమిషనర్లు, స్వచ్ఛాంధ్ర సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌తోపాటు మరో ఎనిమిది మంది అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు.