News
News
X

AP News Developments Today: కర్నూలు జిల్లాలో చంద్రబాబు రెండో రోజు పర్యటన నేడు

ఇవాళ పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఈ సమీక్షా సమావేశం ఉండనుంది.

FOLLOW US: 
కర్నూలులో నేడు కొనసాగనున్న చంద్రబాబు రెండోరోజు పర్యటన 
 
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కర్నూల్  రెండో రోజు రోజు పర్యటించనున్నారు. ఆదోనిలోని చేకూరి ఫంక్షన్ హాల్ లో నైట్ హాల్ట్ చేసిన ఆయన ఈరోజు ఉదయం 11 గంటలకు న్యూ బస్ స్టాండ్ రోడ్, పోలీస్ కంట్రోల్ రూమ్, దర్గా సెంటర్, ఆర్ట్స్ కాలేజ్ మీదుగా రోడ్ షో నిర్వహించనున్నారు. 12:30కి ఆర్ట్స్ కాలేజ్ చేరుకోనున్న ఆయన, అక్కడి నుండి రోడ్ మార్గంలో ఆరెకల్, కోటేకల్ మీదుగా చెన్నాపురం చేరుకుంటారు. అక్కడి నుండి మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి 2:30కు ఎమ్మిగనూరు లోని వేంకటాపురం పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఆర్ & బీ గెస్ట్ హౌస్ మీకుగా అన్నమయ్య సర్కిల్, శివ సర్కిల్, సోమప్ప సర్కిల్, శ్రీనివాస సర్కిల్, సోమేశ్వర సర్కిల్ మీదుగా రోడ్ షో చేస్తారు. 5 గంటలకు ఎమ్మిగనూరులోని తీరు బజార్ లో పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. సాయంత్రం 7 గంటలకు అక్కడి నుండి బయలుదేరి గోనెగండ్ల, కోడుమూరు, పెద్దపాడు మీదుగా రోడ్డు మార్గంలో రాత్రి 9 గంటలకల్లా కర్నూల్ లోని మౌర్య హోటల్ చేరుకొని అక్కడే నైట్ హల్ట్ చేస్తారు.
 
* మరోవైపు ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం  పై వస్తున్న విమర్శల పై ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు దీనిపై 11 గంటలకు తాడేపల్లిలో ప్రెస్ ముందుకు రానున్నారు.

* ఇవాళ పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఈ సమీక్షా సమావేశం ఉండనుంది. 

* నేడు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొననున్నారు. మరోవైపు, తాడేపల్లిగూడెంలో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొంటారు. సాయంత్రం ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరు అవుతారు. 

* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలోని దొడగట్ట బీసీ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పాల్గొంటారు. సత్య సాయి జిల్లా చిలమత్తూరు పరిధిలోని కోడూరు నుంచి విజయవాడ వరకూ నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పరిశీలించనున్నారు. విజయవాడ ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో ఎగుమతి ప్రాసెసర్లు, డాక్యుమెంటేషన్ పై నేడు అవగాహన సదస్సు జరగనుంది.

నేటికి సుప్రీంలో విచారణ వాయిదా

News Reels

ఏపీలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం, ప్రత్యేక దర్యాప్తు టీమ్ చర్యలను నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సుమారు రెండు గంటల పాటు వాదనలు సాగాయి. సుదీర్ఘ వాదనలు సాగిన అనంతరం సుప్రీంకోర్టు దీనిపై విచారణను నేటికి వాయిదా వేసింది. 

Published at : 17 Nov 2022 09:13 AM (IST) Tags: AP Latest news Telugu News Today AP News Developments Today AP Headlines Today

సంబంధిత కథనాలు

Chandrababu Tour : వివేకాను చంపినంత ఈజీగా చంపుతామంటున్నారు - తాటాకు చప్పుళ్లకు  భయపడేది లేదన్న చంద్రబాబు !

Chandrababu Tour : వివేకాను చంపినంత ఈజీగా చంపుతామంటున్నారు - తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్న చంద్రబాబు !

DPHFW Recruitment: ఏపీలో 461 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, అర్హలివే! దరఖాస్తు చివరితేది ఎప్పుడంటే?

DPHFW Recruitment: ఏపీలో 461 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, అర్హలివే! దరఖాస్తు చివరితేది ఎప్పుడంటే?

PVP ED Office : జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా - మరోసారి ఈడీ ఎదుట హాజరైన పీవీపీ !

PVP ED Office  : జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా - మరోసారి ఈడీ ఎదుట హాజరైన పీవీపీ !

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌కు ఊరట

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌కు ఊరట

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

టాప్ స్టోరీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్