Top 5 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ ఇవీ..
Top 5 Headlines Today: ఏపీ, తెలంగాణలో నేటి ఉదయం నుంచి పాలిటికల్, ముఖ్యమైన అప్ డేట్స్ మీకోసం..
Top 5 Headlines Today: గుంటనక్కల్ని వెంటేసుకున్నారు, ఆయన నరమాంస భక్షకుడు అంటూ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు
సీఎం జగన్ అనంతపురం పర్యటన సందర్భంగా జగనన్న వసతి దీవెన నిధులను విడుదల చేశారు. జిల్లాలోని నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును నరమాంస భక్షకుడితో పోల్చారు. ఈ సందర్భంగా పంచతంత్రంలోని ఓ పులి కథను చెప్పి వినిపించారు. ఇటీవల రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఓ కాంక్లేవ్‌లో చంద్రబాబు మాట్లాడిన మాటలను చూస్తే తనకు ఆ కథ గుర్తుకు వచ్చిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. నర మాంసానికి అలవాటు పడిన పులి ముసలిదై వేటాడే శక్తి కోల్పోయాక గుంట నక్కలను వెంట వేసుకొని తిరుగుతుందని మాట్లాడారు. బంగారు కడియం ఆశ చూపి మనుషులను మింగేసే పులి లాగానే చంద్రబాబు కూడా వెన్నుపోటు కుట్రలు పన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాయమాటలు చెప్పే చంద్రబాబు లాంటి వారిని నమ్మకూడదని, కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
" అడవిలోని ముసలి పులి ఓపిక లేక మనుషుల్ని ఎలా తినాలని ప్లాన్ వేసుకుంది. దారిలో ఓ చెరువు పక్కన కూర్చుని.. వచ్చిపోయే మనుషులకు నగల్ని ఆశ చూపెట్టేది.. ‘తమ్ముళ్లూ.. కడియం కావాలంటే నీటిలో మునగాలి’ అంటూ ఊరించేది. ఈ పులిని నమ్మితే తినేస్తుంది కదా అని అందరూ నమ్మకుండా పోయారు. కానీ, ఆ పులి మాత్రం నేను సీనియర్ మోస్ట్ పులిని. అడవిలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ నాది. గతంలో బాగా తినేవాడని.. ఇప్పుడు మంచోడినైపోయి తినదల్చుకోలేదని అబద్ధపు మాటలు చెప్పేది. పులి ముసలిది అయిపోయింది కదా.. అని నమ్మిన వాళ్లూ నీటిలో మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు. ఆ మడుగులో బురదతో ఇరుక్కుంటే పులి చంపేసి తినేసేది. అందుకే అబద్ధాలు చెప్పేవారి మాటలు నమ్మకూడదు " ఇంకా చదవండి
వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదావేసింది. గురవారం మధ్యాహ్నం 3.30కి విచారిస్తామని న్యాయమూర్తి చెప్పారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పిటిషన్ ఇవాళ అసలు లిస్టే కాలేదు. పదిన్నరకు అవినాష్ కేసు విషయాన్ని ఆయన తరఫున వాదించే న్యాయవాది ప్రస్తావించారు. విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి చెప్పారు. జాబితాలో లేని పిటిషన్లపై విచారణ చేపట్టబోమని హైకోర్టు తెలిపింది. గురువారం విచారణ చేపట్టాలని అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాది రిక్వస్ట్ చేశారు. అదే టైంలో శుక్రవారం వాదనలు వినిపించేందుకు అనుమతివ్వాలని సునీత తరఫు న్యాయవాది కోరారు. కోర్టు మాత్రం గురువారం మధ్యాహ్నం 3.30గంటలకు విచారణ చేపడతామని ప్రకటించింది.
ముందుగా ఈ కేసు విచారణ మంగళవారం ఉదయం ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని అవినాష్ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీంతో ఆర్డర్ కాపీని చూసిన తర్వాతే తుది తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత మధ్యాహ్నం మళ్లీ విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు బుధవారం వింటామని న్యాయమూర్తి .. కేసును వాయిదా వేశారు. ఇవాళ ఉదయం మరోసారి విచారణకు వచ్చింది. దీన్ని గురువారానికి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ఇంకా చదవండి
బీఆర్ఎస్ వై నాట్ కర్ణాటక ? - కేసీఆర్ వ్యూహం ఏమిటి ?
ఫస్ట్ టార్గెట్ అని ప్రకటించిన కర్ణాటకలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పోటీ పెట్టలేకపోయారు. కనీసం తమ మిత్రపక్షం అని చెప్పుకుంటున్న జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారానికి వెళ్తారో లేదో స్పష్టత లేదు. కేసీఆర్ కర్ణాటక విషయంలో ఎందుకు పూర్తిగా నిరాసక్తంగా ఉన్నారనేది బీఆర్ఎస్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే కర్ణాటకలో బీఆర్ఎస్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో ఉన్న కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపి ఉండేవారు. బెంగళూరులోనూ బీఆర్ఎస్ ప్రభావం ఉండేది. కానీ ఎందుకు కేసీఆర్ సైలెంట్ అయ్యారు.
కుమారస్వామితో అంత సాన్నిహిత్యం ఒక్క సారిగా ఎందుకు తగ్గిపోయింది ?
బీఆర్ఎస్‌తో కలిసి పని చేయడానికి జేడీఎస్ సిద్ధంగా ఉంది. ఆ పార్టీ నేత కుమారస్వామి కేసీఆర్ ఎప్పుడు పిలిచినా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చేవారు. కలిసి పోటీ చేయడానికి కుమారస్వామి అంగీకారం తెలిపారు. తర్వాత ఖమ్మంలో జరిగిన ఆవిర్భావ సభలో ‘రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్ని కల్లో పోటీ చేస్తం. జేడీఎస్ కుసంపూర్ణ మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొంటం. మన రాష్ట్ర సరిహద్దు లో ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీని గెలిపించి కు మారస్వామిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. బీఆర్ఎస్జాతీయ రాజకీయ ప్రస్థానం కర్నాటకతోనే మొదలైతది అని వ్యాఖ్యానించారు. అయితే ఆ సభకు కుమారస్వామి రాలేదు. అప్పుడే కాదు ఆ తర్వాతా రాలేదు. కేసీఆర్ కూడా వెళ్లలేదు. ఇంకా చదవండి
నోటిదాకా వచ్చిన పంట వర్షం పాలు, అధైర్యపడొద్దు అందర్నీ ఆదుకుంటాం - హరీశ్ రావు
తెలంగాణలో గత రాత్రి (ఏప్రిల్ 25) కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్ల వల్ల కొన్ని ప్రాంతాల్లో రైతులు భారీ ఎత్తున పంటలు నష్టపోయిన సంగతి తెలిసిందే. పంట చేతికి వచ్చి రేపో మాపో అమ్మకానికి పెడదామని ఆశతో ఉన్న రైతులు నీటిపాలైన ధాన్యం చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. అయితే, వారికి భరోసా ఇచ్చేలా ఆర్థిక మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. నోటికాడి బుక్క జారిపోయిందని ఎంతో బాధతో ఉన్న రైతులను ఓదార్చడానికి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి హరీశ్ రావు తన నియోజకవర్గంలో పర్యటించారు. గ్రామాలలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామని హరీశ్ రావు చెప్పారు.
మంత్రి హరీశ్ రావు పంట నష్టంపై స్పందిస్తూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.10 వేలు నష్ట పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని హరీశ్ రావు అన్నారు. రైతులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని అభయం ఇచ్చారు. దేశంలో ఎక్కడా రెండు, మూడు వేలకంటే ఎక్కువ ఇవ్వడం లేదని అన్నారు. రైతులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు. ఒక్క తెలంగాణలోనే వేల కోట్లు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యుత్ ను రైతులకు అందించామని చెప్పుకొచ్చారు. ఒక్క సిద్దిపేటలోనే మొదటి దశలో 35 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు. నిన్నటి వానతో నష్టం ఎంత అనే వివరాలు రావాల్సి ఉందని, దానిపై అంచనా వేస్తున్నామని చెప్పారు. ఇంకా చదవండి
కోర్టులు చెప్పినా పట్టించుకోరా? సీఎస్‌కు చంద్రబాబు లెటర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరో లేఖ రాశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదులు చేసిన విషయాన్ని సీఎస్‌కు చంద్రబాబు గుర్తు చేశారు. అయినా ఆయా ఫిర్యాదులపై అధికారులు స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. అధికార వైఎస్సార్‌సీపీ నేతలతో ఓ వర్గం అధికారులు కుమ్మక్కై ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని లేఖలో ఆరోపించారు. అనుమతికి మించి ఇసుక తవ్వకాలకు జయప్రకాష్ వెంచర్స్ పాల్పడుతోందని చంద్రబాబు తప్పుపట్టారు. అక్రమ తవ్వకాలపై హైకోర్టులో కూడా విచారణ జరిగిందని గుర్తు చేశారు. ఇంకా చదవండి