Top Headlines: ఏపీ హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ - సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్ డే విషెష్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. ఏపీ హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వంపై అసభ్యకరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి రాష్ట్ర హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సచివాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ నేతలపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వైసీపీ (Ysrcp) కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని అన్నారు. ఇంకా చదవండి.
2. అసెంబ్లీకి వైసీపీ దూరమవుతుందా.?
ఆంధప్రదేశ్ అసెంబ్లీ సమవేశాలు పదకొండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలపై ప్రజలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. చర్చలు హోరాహోరీగా సాగితే ఎన్నో అంశాలు వెలుగులోకి వస్తాయి. అయితే ప్రస్తుతం వైసీపీ అసెంబ్లీకి హాజరవ్వకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. మైక్ ఇవ్వరు కాబట్టి తాము హాజరు అయ్యేది లేదని ఆయన చెబుతున్నారు. ఇంకా చదవండి.
3. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్ డే విషెష్
పుట్టిన రోజు జరుపుకుంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రేవంత్‌ను విష్ చేశారు. అంతే కాకుండా తన ఇంటికి ఎవరినైనా దర్యాప్తు అధికారులను పంపించవచ్చని సూచించారు. తెలంగాణలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై కీలక అరెస్టు ఖాయమంటూ గత కొన్ని రోజులుగా అధికార పార్టీ హెచ్చరికలు చేస్తోంది. దానికి ప్రతిపక్షం బీఆర్‌ఎస్ దీటుగా సమాధానం చెబుతూ వస్తోంది. ఇంకా చదవండి.
4. అప్పు తిరిగివ్వలేదని మహిళల కిడ్నాప్
సుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని కుటుంబ సభ్యులపై దాడి చేసి ఓ మహిళను కిడ్నాప్ చేశాడు కాంట్రాక్టర్. మహిళను కిడ్నాప్ చేసే సమయంలో అడ్డు వచ్చిన వారిపై దాడి చేసి మహిళలు చూడకుండా చితకబాదారు . ఏకంగా ఓ మేస్త్రి తల్లిని బలవంతంగా తన వెంట తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు ఏడ్చిన బతిమాలిన వదిలి పెట్టాలని వేడుకున్న కనికరించలేదు. అనారోగ్యంతో ఉందని చెప్పిన వినిపించుకోకుండా వృద్ధురాలు అని కనికరం లేకుండా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. డబ్బులు ఇచ్చి తమ తల్లిని విడిపించుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు చివరకు కాంట్రాక్టర్‌కు మేస్త్రీకి మధ్య పంచాయతీ ఓ వృద్ధురాలి ప్రాణాల మీదికి తీసుకొచ్చింది. ఇంకా చదవండి.
5. టెట్ - 2 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET)-II- 2024 కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 7న అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు నవంబరు 20 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు డిసెంబరు 26 నుంచి టెట్ పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత మేలో నిర్వహించిన టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ వచ్చే జనవరిలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేకుండానే ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని అప్పట్లో సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా చదవండి.