TTD Tirumala Tirupati Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నిమిషాల్లో ఖాళీ అయిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు..
Tirumala Tirupati Tickets: ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పొందిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది టీటీడీ.. అధికారిక వెబ్ సైట్ లో టిక్కెట్లు కేవలం నిమిషాల వ్యవధిలో బుక్ అయ్యాయి.
TTD Tirumala Tirupati Tickets: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీనివాసుడి దర్శనానికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు.. కోవిడ్-19 కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్న టీటీడీ.. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పొందిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది టీటీడీ.. ఇలా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్లను జియో క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో టిక్కెట్లను అందుబాటులోకి ఉంచుతోంది టీటీడీ.
గతంలో భారీ హిట్స్ ద్వారా టీటీడీ అధికారిక వెబ్ సైట్ టిక్కెట్లు విడుదల చేసిన సమయంలో సర్వర్ డౌన్ అయ్యేది. దింతో జియో సహకారం అందించడంతో సాంకేతికంగా ఏర్పడిన సమస్య తొలగి భక్తులకు క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా సులభతరంగా టిక్కెట్లు పొందే అవకాశం కలుగుతోంది. వెంకన్న ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను టీటీడీ ఇవాళ ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించి టిక్కెట్లను టీటీడీ వెబ్ సైట్ tirupatibalaji.ap.gov.in లో విడుదల చేశారు. ప్రత్యేక ప్రవేశ టోకెన్లను ఇలా విడుదల చేయడం అలా నిమిషాల వ్యవధిలోనే బుకింగ్స్ పూర్తి అయ్యాయి.
కేవలం 45నిమిషాల వ్యవధిలోనే 3.36 లక్షల ప్రత్యేల ప్రవేశ దర్శన టిక్కెట్లను శ్రీవారి భక్తులు పొందారు. శ్రీవారి దర్శనం కోసం లక్షలాదిగా వేచి చూస్తున్న భక్తులకు టీటీడీ నుంచి నిరాశ మాత్రం తప్పడం లేదు.. ఓ వైపు ఓమిక్రాన్ ముప్పు ముంచుకొస్తుంటే మరోవైపు సాధారణ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి మాసంలో కూడా దర్శనం కోటాను టీటీడీ పెంచలేదు. 3.36 లక్షల టిక్కెట్లను విడుదల చేయడంతో కేవలం 45నిమిషాల వ్యవధిలోనే టోకెన్లు అన్నింటిని భక్తులు బుక్ చేసుకున్నారు. టోకెన్లు కోటా పూర్తయిన విషయం తెలియని భక్తులు ఇంకా వేలాదిగా టోకెన్లను కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. రేపు ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టిక్కెట్లను అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేయనుంది టీటీడీ.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టిటిడి భక్తులకు కోరుతుంది.. పలువురు భక్తులు నెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు. దీనివలన అనేక భక్తులు ఇబ్బందికి గురి అవుతున్నారు.
ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ - 19 మూడవ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూపించిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. కావున భక్తులు తమ ఆరోగ్యం, అదేవిధంగా టిటిడి ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడికి సహకరించాలని కోరింది..
Also Read: Horoscope Today 28 January 2022: ఈ మూడు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Also Read: వారంలో ఈ రోజు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు సిద్ధిస్తాయట...