By: ABP Desam | Updated at : 29 Mar 2023 10:34 AM (IST)
Edited By: jyothi
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - క్షణాల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం!
Tirumala Hundi Income: శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉండడంతో నేరుగా భక్తులను శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. దీంతో క్షణాల్లో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీనివాసుడికి ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా నివేదిస్తారు అర్చకులు. ఇక బుధవారం నాడు బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని అర్చకులు స్వామి వారి నైవేద్యంగా మొదటి గంటాలో సమర్పిస్తారు. మంగళవారం రోజున 70,605 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 24,947 మంది తలనీలాలు సమర్పించగా.. 4.79 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.
మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు..
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాస మూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు సమర్పించగా, ఇక బుధవారం నాడు "బెల్లం పాయసం" ను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
సహస్రకళషాభిషేకం నిర్వహణ..
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వీఐపీ భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్రకళషాభిషేకం"ను విగ్రహ అరుగుల కారణంగా పరిరక్షణకై ఆగమ శాస్త్రం పండితుల సలహాలు, సూచనల మేరకు టీటీడీ రద్దు చేసింది. కేవలం ఏడాదికి ఓ మారు సర్కారు వారి సహస్రకళషాభిషేకం నిర్వహిస్తొంది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు.
చివరగా ఏకాంత సేవ..
సాయంకాలం సహస్ర దీపాలంకారసేవ కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప అర్చకులు నిత్యోత్సవం జరిపిస్తారు. సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. నిత్య సేవల్లోభాగంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకార సేవను నిర్వహించి, తిరు ఉత్సవం చేస్తారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులు శ్రీవారి ఆలహం చేరుకోగానే, సృవదర్శనం భక్తులను నిలిపి వేసి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. రాత్రి కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.
Tirumala News: తిరుమలలో ఆ వాహనాలు నిషేధం, అడిషనల్ ఎస్పీ మునిరామయ్య కీలక ప్రకటన
Top 5 Headlines Today: బీజేపీలో ఉండలేమంటున్న నేతలు, మరికొంత సమయం కావాలంటున్న వైసీపీ
TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్
Top 10 Headlines Today: చెన్నై పాంచ్ పవర్, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ
AP Registrations : ఏపీలో రివర్స్ రిజిస్ట్రేషన్ల పద్దతి - ఇక మాన్యువల్‌గానే ! సర్వర్ల సమస్యే కారణం
KTR : జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !
BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?
Kakani Satires On Chandrababu: మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసిన ఘనత చంద్రబాబుదే- మంత్రి కాకాణి