అన్వేషించండి

Tirumala: తిరుమలలో నేడు జరిగే పూజలు ఇవే, పెరిగిన రద్దీ - శ్రీవారి దర్శనానికి భారీగా టైం

స్వామి వారి దర్శనంకు 20 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.

TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం 17-09-2022న స్వామి వారిని 82,392 మంది దర్శించుకోగా,41,800 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఇక స్వామి వారికి భక్తులు కానుకల హుండీ రూపంలో 4.59 కోట్ల రూపాయలు లభించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టమెంట్లు భక్తులతో నిండి పోవడంతో బయట నందకం గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి దర్శనంకు 20 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది..తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీతో ఏడుకొండలు గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. బయట క్యూలైన్స్ లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి అసౌఖర్యం కలుగకుండా టిటిడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రద్దీ దృష్ట్యా భక్తులు ఒపికతో స్వామి వారి దర్శనం పొందాలని టిటిడి విజ్ఞప్తి చేస్తొంది.

నేటి పూజల వివరాలు సవివరంగా..

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు అర్చకులు. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు..


శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తరువాత గొల్ల హారతి సమర్పణ జరుగుతుంది. తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థంను అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి,తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేసిన అర్చకులు. తోమాల సేవ ప్రారంభిస్తారు. ముందుగా ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధా క్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు..

శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం,అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అటుతరువాత వక్షఃస్ధల లక్ష్మీ ,పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు..ఈ తంతుతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు.


శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేసి, సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహించిన తరువాత సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనంకు భక్తులను అనుమతిస్తారు.

అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విమాన ప్రకారం ప్రదక్షిణ దిశగా చేస్తూ కళ్యాణోత్సవ మండపంకు వేంచేపు చేసి, స్వామి అమ్మవార్ల కు కళ్యాణోత్సవం కార్యక్రమంను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అర్చకులు. శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత సహ్రదీపాలంకరణ సేవ నిర్వహించిన‌ అర్చకులు, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు..అనంతరం ఆలయంకు చేరుకున్న అనంతరం సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు అర్చకులు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల,రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget