Tirumala News: తిరుమలకు వెళ్లేవారికి అలర్ట్! ఎన్నికల కోడ్ వల్ల ఆ సర్వీసుకు బ్రేక్
AP Latest News: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
Tirumala Latest News: ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతంలో తరహాలో తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫారస్సు లేఖలు స్వీకరించబోరని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం, వసతి కల్పిస్తారని స్పష్టం చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శనివారం నుంచి తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్దేశించిన విధివిధానాల మేరకు దర్శనం, వసతి కల్పిస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఏ రకమైన వసతి, దర్శనాలకు కూడా సిఫారసు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు, వీఐపీలు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా విజ్ఞప్తి’’ అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలో తెలిపింది.