అన్వేషించండి

Tirumala News: తిరుమలకు ఈ వాహనాలపై వెళ్తున్నారా? ఈ టైంలో నో ఎంట్రీ

TTD News: తిరుమల ఘాట్ రోడ్డుపై ఆగస్ట్ 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Tirumala Tirupati Ghat Road: శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్డుపై బైకర్ల రాకపోకలపై కొద్ది రోజులు ఆంక్షలు విధించారు. ఆగస్ట్ 12వ తేదీ సోమవారం నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆగస్ట్ 12వ తేదీ సోమవారం నుంచి వెంటనే అమలులోకి వస్తుందని ఓ ప్రకటన విడుదల చేసింది.

టీటీడీ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ తెలిపిన విధంగా, ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో క్రూర మృగాలు మొదటి ఘాట్ రోడ్డులో తరచుగా రోడ్లు దాటుతున్నాయి. భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా మానవ-జంతు సంఘర్షణను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను మొదటి, రెండవ ఘాట్ రోడ్‌లలో అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. కాబట్టి, భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.

వరలక్ష్మీ వ్రతం క‌ర‌ప‌త్రాలు విడుదల చేసిన శ్యామలరావు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ జ‌రగ‌నున్న వరలక్ష్మీ వ్రతం కరపత్రాలను సోమవారం (ఆగస్టు 12) టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుప‌తిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని ఈవో కార్యాల‌యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుచానూరులోని ఆస్థాన‌మండ‌పంలో ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వ‌ర‌ల‌క్ష్మీ వ్రతం జరుగుతుందని చెప్పారు. అదేరోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Bhadrachalam Water Level: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Devara Part 1 Trailer Reaction | ధైర్యాన్ని చంపేసే భయం..దేవరగా తారక్ ప్రభంజనం | ABP DesamAttack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP DesamVamsadhara Flood Gotta Barrage | భారీ వర్షాలతో వంశధారకు పోటెత్తుతున్న వరద | ABP Desamఅనంత్, రాధికల పెళ్లిలోని వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Bhadrachalam Water Level: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
Palnadu News: పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
Alcazar Vs Carens: అల్కజార్ వర్సెస్ కారెన్స్ - ధర, ఫీచర్స్ పరంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్?
అల్కజార్ వర్సెస్ కారెన్స్ - ధర, ఫీచర్స్ పరంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్?
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Uttarakhand Landslide: కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి - సీఎం సంతాపం
కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి - సీఎం సంతాపం
Embed widget