అన్వేషించండి

TTD News: శ్రీవారి పరకామణిలో దొంగతనం, డబ్బులు అక్కడపెట్టుకొని కాజేసి ఉద్యోగి - పట్టుకున్న అధికారులు

నోట్ల లెక్కింపు సమయంలో కొన్ని విదేశీ నోట్లను మల ద్వారం వద్ద ఉంచుకుని బయటకు వెళుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు.

తిరుమలలోని నూతన నోట్ల పరకామణి మండపంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు ఉన్నా కూడా అతను చోరీకి పాల్పడడంతో అధికారులు విస్తుపోయారు. సీసీటీవీ కెమెరాల ద్వారా విజిలెన్స్ అధికారులు నిందితుడిని ఇట్టే గుర్తించారని ప్రకటనలో పేర్కొన్నారు.

నోట్ల లెక్కింపు సమయంలో కొన్ని విదేశీ నోట్లను మల ద్వారం వద్ద ఉంచుకుని బయటకు వెళుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. విజిలెన్స్ అధికారులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో నోట్లను గుర్తించి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. నూతన పరకామణి మండపంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చెయ్యడం, అడుగడుగునా సీసీటీవీ కెమెరాల నిఘా ఉంచడంతో ప్రతి ఒక్కరి కదలికపై సూక్ష్మ స్థాయిలో నిఘా ఉంచుతున్నారు. 

గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా వెంటనే గుర్తించే వెసులుబాటు ఉండేది కాదు. నూతన పరకామణి మండపంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన భధ్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.  దీంతో స్వామి సేవ కోసం వచ్చి, చోరీకి పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించగలుగుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుందని భద్రత అధికారులు స్పష్టం చేశారు.

ఇటీవలే కొత్త పరకామణి భవనం ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో నిర్మించిన నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని గత ఫిబ్రవరిలో టిటిడి ఈవో ఏవీ.ధర్మారెడ్డి ప్రారంభించారు. ముందుగా ఉదయం 9 గంటల నుండి నూతన పరకామణి భవనంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన హోమం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయం నుండి తీసుకుని వచ్చిన హుండీ కానుకలను వేరు చేయడం, లెక్కించడం ప్రక్రియను ప్రారంభించారు.  

బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాత‌న సౌక‌ర్యాల‌తో కూడిన నూత‌న పరకామణి భవనాన్ని టీటీడీ నిర్మించింది. గత ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 28న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి ఈ నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఈ భవనంలో అభివృద్ధి పనులను టిటిడి చేపట్టింది. శ్రీవారి దర్శనార్శం తిరుమలకు విచ్చేసిన భక్తుడు స్వామి వారికి సమర్పించే కానుకల లెక్కింపు స్వయంగా వీక్షించే విధంగా భవనంకు నలువైపులా అద్దాలు ఏర్పాటు చేసింది టిటిడి. ఈ సందర్భంగా టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ. తిరుమలలో అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన పరకామణి భవనంను ప్రారంభించడం జరిగిందన్నారు.  

ఈ నూతన పరకామణి భవనంలో అన్ని సిబ్బందికి అవసరం అయ్యే అన్ని ఏర్పాట్లు కల్పించడం జరిగిందని, అయితే ఇవాళ 12 హుండీలను శ్రీవారి ఆలయం నుండి నూతన పరకామణికి తరలించి, లెక్కింపు ప్రక్రియను ప్రారంభించామన్నారు. అయితే ముందస్తుగా హుండీ కానుకలను పరకామణికి తరలించేందుకు ట్రయల్ రన్ చేశామని, నేడు అది సక్సెస్ పుల్ అయిందని అన్నారు. రేపటి నుండి హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో లెక్కించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ఉన్న ప్రస్తుత పరకామణిలో భక్తులు కూర్చుని ధ్యానం చేసుకోడానికి స్థలం కేటాయించడం జరిగిందన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget