Tomato Price Hike: మదనపల్లె మార్కెట్లో రూ.200 పలికిన టమాటా ధర, ఆల్ టైమ్ రికార్డ్ ప్రైస్
Tomato Price Hike at Madanapalle Market: కిలో టమాటా ధర ఏకంగా రూ.196 నుంచి రూ.200కు చేరి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
![Tomato Price Hike: మదనపల్లె మార్కెట్లో రూ.200 పలికిన టమాటా ధర, ఆల్ టైమ్ రికార్డ్ ప్రైస్ Tomato Price Hike 1 kg Tomato price reaches Rs 200 at Madanapalle Market Tomato Price Hike: మదనపల్లె మార్కెట్లో రూ.200 పలికిన టమాటా ధర, ఆల్ టైమ్ రికార్డ్ ప్రైస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/29/0483e510609c9ba2964237152a2cf19d1690642979753233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tomato Price Hike at Madanapalle Market: గత నెల రోజుల నుంచి దేశ వ్యాప్తంగా సామాన్యులకు భయపెడుతున్న అంశాల్లో టమాటా ఒకటి. వంటింటి సరుకు అయిన టమాటా రికార్డు ధరలు పలుకుతోంది. ఇప్పటికే కొందరు వంటకాలలో టమాటాను తగ్గించగా, కొందరు ఏకంగా టమాటా కొనడం మానేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో టమాటా రికార్డు ధర పలికింది. కిలో టమాటా ధర ఏకంగా రూ.196 నుంచి రూ.200కు చేరి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఏపీ, తెలంగాణలో కొందరు రైతులు నెల రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు సంపాదించారు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో రోజురోజుకూ టమాటా రికార్డు ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ మార్కెట్లో నాణ్యమైన సరుకు కేజీకి రూ.168 పలకడం తెలిసిందే. తాజాగా శనివారం మార్కెట్లో కిలో టమాటా ధర ఏకంగా రూ.196 పలికింది. కొన్ని రోజుల కిందట నిపుణులు అంచనా వేసిన ధరలను టమాటా రీచ్ అయింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో టమాటా రూ.250 నుంచి రూ.300 చేరే అవకాశం ఉందని జులై తొలి వారంలో మార్కెట్ నిపుణుల అంచనా వేశారు. ధర దిగుతుందని ఆశలు పెంచుకున్న ఏపీ వాసులకు నిరాశే ఎదురైంది. రూ.170 కి చేరిన కేజీ టమాటా ధర తగ్గుతుందని భావించగా.. అనూహ్యంగా శనివారం రూ.200 వరకు పలికి టమాటా రైతులకు లాభాల పంట పండించింది. సామాన్యూలకు మాత్రం కరెంట్ షాక్ కొట్టినంత పనవుతోంది.
జులై 29న (శనివారం) మదనపల్లె మార్కెట్‌కు 253 టన్నుల టమాటా వచ్చింది. ఇది చాలా తక్కువ మొత్తం సరుకు అని వ్యాపారులు తెలిపారు. ఈ క్రమంలో నాణ్యమైన టమాటా రకం మదనపల్లె మార్కెట్లో రూ.160 నుంచి రూ.196, ఆ తరువాత క్వాలిటీ టమాటా రూ.130 నుంచి రూ.160 వరకు రేటు పలికింది. రైతులు విక్రయించే 25 కేజీల టమాటా బాక్స్ ధర రూ.4500 నుంచి రూ. 4,900 మధ్య ఉందని మార్కెట్ వాళ్లు చెబుతున్నారు. దక్షిణాది నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు మదనపల్లె మార్కెట్ నుంచి ఎగుమతి అవుతుంది. కర్ణాటకలోని మార్కెట్ లో సైతం టమాటా మంట ఇంకా తగ్గడం లేదు. ఆ ప్రభావం మదనపల్లె మార్కెట్ పై సైతం కనిపిస్తోంది. మార్కెట్ కు ఎక్కువ సరుకు రాకపోతే కేజీ టమాటా ధర రూ.200 నుంచి రూ.220 -రూ.250 చేరడం పెద్ద సమస్య కాదని తెలుస్తోంది.
రెస్టారెంట్‌లలో నో టమాటా..
టమాటా ధరలకు భయపడి ప్రముఖ ఫుడ్ చెయిన్ సంస్థలు తమ ఉత్పత్తుల్లో టమాటాలు వాడడం నిలిపివేశాయి. రెండు వారాల నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో మెక్ డొనాల్డ్స్ పిజ్జాల్లో టమాట ముక్కలు వేయడం లేదు. తాజాగా ఈ జాబితాలోకి సబ్‌వే చేరింది. భారత్ లోని చాలా సబ్‌వే అవుట్లెట్లలో టామాటా వినియోగం ఆపేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లోని సబ్‌వే ఔట్‌లెట్ టమాటలు వినియోగించడం లేదంటూ డిస్‌ప్లే చేసింది. వీలైనంత వేగంగా టమాటా ఉత్పత్తులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎన్ని బ్రాంచుల్లో ఈ పరిస్థితి ఎలా ఉందో స్పష్టమైన వివరాలు లేవు. భారత దేశం అంతటా కొన్ని ఔట్లెట్లలో అందిస్తున్నా ఢిల్లీలోని రెండు, ఉత్తరప్రదేశ్ లో ఒకటి, చెన్నైలో ఒకటి టమాటాలను ఉపయోగించడం లేదని సబ్ వే ఉద్యోగి ఒకరు తెలిపారు. రెండు వారాల క్రితం దేశంలోని చాలా ప్రాంతాల్లో మెక్ డొనాల్డ్స్ పిజ్జాల్లో టమాట ముక్కలు వేయడం లేదు. పెరిగిన ధరలతో ఇలా చేయడం లేదని.. తమ నాణ్యతా ప్రమాణాలకు తగిన టమాట (Tomato Price) సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని రెస్టారెంటు చెబుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)