Tirumala News: శ్రీవారి మెట్టు గుండా దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ?-టోకెన్లు ఇచ్చే ప్లేస్ మారింది ! ఎక్కడిస్తారంటే ?
Alipiri:శ్రీవారి దర్శనానికి కాలి నడకన వెళ్లే భక్తులకు టోకెన్లు ఇచ్చే ప్లేస్ మార్చారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లు ఇవ్వనున్నారు.

Srivari Mettu: శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా మార్చుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టువద్ద నుండి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా శ్రీవారి మెట్టు వద్ద నుండి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని టిటిడి నిర్ణయించింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులోకి రానున్నాయి.
ఇదే అంశానికి సంబంధించి టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు మంగళవారం సాయంత్రం వర్చువల్ సమావేశం ద్వారా టిటిడి అధికారులతో సమీక్షించారు . శ్రీవారి మెట్టు నుండి కాలినడకన వెళ్లే దివ్య దర్శనం భక్తులకు టోకెన్ల జారీ కోసం భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలికంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 6వ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి టోకెన్లు జారీ ప్రక్రియ టోకెన్ల లభ్యత మేరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఇస్తారు. తమ ఆధార్ చూపించి దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టులోని 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
శనివారం శ్రీవారి దర్శనం నిమిత్తం శుక్రవారం సాయంత్రం దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు. ఇదే సమయంలో మరోపక్క ఎస్ ఎస్ డి టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో వాటి కొరకు నిర్దేశించిన కౌంటర్లలో అందిస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టిటిడి విజిలెన్స్ , సెక్యూరిటీ, జిల్లా పోలీసులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించడానికి అధికారుల బృందాన్ని నియమించి, టోకెన్ కౌంటర్ల దగ్గర ఇబ్బంది లేని వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
Divya Darshan tokens for Srivari Mettu pilgrims will now be temporarily issued at Alipiri Bhudevi Complex instead of #SrivariMettu.
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) June 3, 2025
New counters will be operational from Friday evening, June 6.
Aadhaar is mandatory. Scanning must be done at the 1200th step.#TTD #Tirumala pic.twitter.com/fWG0PDPO0j
శ్రీవారి మెట్టు వద్ద నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు టోకెన్ కౌంటర్ల తాత్కాలిక మార్పు అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు . భక్తుల సౌకర్యార్థం పటిష్ట క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు . భక్తులకు అందించే అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా విభాగాధిపతులను సూచించారు. శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.





















