అన్వేషించండి

Venkaiah Naidu: శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీని సందర్శించిన వెంకయ్యనాయుడు - మోహన్ బాబుకు అభినందనలు

శ్రీ విద్యానికేతన్ క్యాంపస్ లో పచ్చదనంతో పాటు, సౌకర్యాలకు పెద్దపీట వేసిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Sree Vidyanikethan Engineering College: 
తిరుపతి: యువతరం సూర్యుడితో పాటు అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి సమీపంలో ఉన్న శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యానికేతన్ పరిసరాల్లో ఉన్న సాయిబాబ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. క్యాంపస్ మొత్తాన్ని పరిశీలించిన వెంకయ్యనాయుడు అక్కడి సౌకర్యాలను, అతిపెద్ద వంటగదిని, పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న గ్రంథాలయాన్ని సందర్శించారు. క్యాంపస్ లో పచ్చదనంతో పాటు, సౌకర్యాలకు పెద్దపీట వేసిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ పచ్చదనాన్ని కాపాడుకుంటున్న కళాశాల నిర్వహణ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

దేశభక్తి అంటే దేశాన్ని గౌరవించటం మాత్రమే కాదన్న వెంకయ్యనాయుడు, దేశమంటే మట్టికాదోయ్ - దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలను గుర్తు చేశారు. సాటి మనిషిని గౌరవించటం, ప్రకృతిని కాపాడుకోవటం, మన బాధ్యతలను మనం నిర్వర్తించటంలోనే నిజమైన దేశభక్తి దాగి ఉందని తెలిపారు. ముఖ్యంగా ఈతరం యువత భాష సంస్కృతులకు దూరమౌతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, పెద్దలను గౌరవించటం, మన సంస్కృతిని అలవరుచుకోవటం, భాషను కాపాడుకోవటం జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఉదయాన్నే నిద్ర లేవటం, వ్యాయామం, చదవటం, సంగీతాన్ని ఆస్వాదించటం, పచనమైన ఆహారాన్ని భుజించటం వంటివి చక్కని శారీరక ఆరోగ్యాన్నే గాక, మానసిక అరోగ్యాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.

Venkaiah Naidu: శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీని సందర్శించిన వెంకయ్యనాయుడు - మోహన్ బాబుకు అభినందనలు

ఈ మధ్యకాలంలో సాంకేతికంగా దేశం సాధిస్తున్న అభివృద్ధిని చూస్తుంటే ఆనందంగా ఉందన్న వెంకయ్యనాయుడు, అదే సమయంలో సాంకేతికతను యువత సరైన విధంగా వాడుకోకపోవటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక అభివృద్ధి మంచిదే అని అదే సమయంలో మన సృజనాత్మకత, జ్ఞాపక శక్తి పెంచుకునే ప్రయత్నం జరగాలని, అన్నింటికీ సాంకేతికత మీద ఆధారపడి మెదడును మొద్దు బారేలా చేసుకోవటం మంచిది కాదని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్ళాలన్న యువత ఆకాంక్షలను సమర్థించిన ఆయన వెళ్ళండి - నేర్చుకోండి - సంపాదించండి - తిరిగి మీ దేశాభివృద్ధి కోసం పాటు పడండి (గో.. లెర్న్.. ఎర్న్... రిటర్న్...) అని ఉద్బోధించారు. జీవితంలో ప్రతి మనిషి కన్న తల్లిదండ్రులను, పుట్టిన ప్రదేశాన్ని, జన్మనిచ్చిన దేశాన్ని, మాతృభాషను, చదువు చెప్పిన గురువును మరువు కూడదని పేర్కొన్నారు. మాతృభాష ఔన్నత్యాన్ని వివరించిన ఆయన, ముందు మాతృభాషను నేర్చుకోవాలని, ఆ తర్వాత సోదర భాషలను, అనంతరం ఇతర భాషలను నేర్చుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.

మన చదువు డిగ్రీల కోసం మాత్రమే కాదు, మన జ్ఞానాన్ని నిత్యం అభివృద్ధి చేసుకోవాలని యువతకు సూచించారు వెంకయ్యనాయుడు. భారతదేశ జనాభాలో సగానికి పైగా యువతరమే ఉందని, భారత దేశ అభివృద్ధిలో యువజనశక్తి భాగస్వామ్యం కావాలన్నారు. కష్టపడే భారతీయ యువతకు అన్ని రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని, వారు రావాలనుకుంటే రాజకీయాల్లోకి కూడా రావచ్చన్నారు. రాజకీయాల్లో విలువలు పెంచే బాధ్యత యువత మీదే ఉందన్న ఆయన, ఈ దిశగా యువతరం పూనుకోవాలని ఆకాంక్షించారు. అభివృద్ధి సూచీలో భారతదేశం ఏ విధంగా ముందుకు పోతుందో, సంతోషకరమైన జీవన విధానం సూచీలో కూడా అదే విధంగా ముందుకు పోవాలని ఆకాంక్షించిన ఆయన, ఈ రెండిటినీ యువతరమే సాధించగలదని గుర్తు చేశారు. 

ఈ కార్యక్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ మోహన్ బాబు, సి.ఈ.ఓ. మంచు విష్ణు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వినయ్ మహేశ్వరి, యూనివర్సిటీ ఉపకులపతి డా. నాగరాజ రామారావు, జె.ఎన్.టి.యూ అనంతపురం సంచాలకు డా. బి.ఈశ్వర్ రెడ్డి, రిజిస్ట్రార్ కె.సారధి, ప్రిన్సిపల్ డా. బి.ఎమ్. సతీష్ తదితరులు హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు వెంకయ్యనాయుడు బంగారు పతకాలను ప్రదానం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind u19 vs Pak u19 Final Live Streaming: భారత్, పాక్ అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ ఎక్కడ చూడాలి, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
భారత్, పాక్ అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ ఎక్కడ చూడాలి, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
World Bank Loan For Pakistan: పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 104 రివ్యూ... బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల సందడి... కళ్యాణ్ తలకు గాయం... చివర్లో సీజన్ 10 ట్విస్ట్
బిగ్‌బాస్ డే 104 రివ్యూ... బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల సందడి... కళ్యాణ్ తలకు గాయం... చివర్లో సీజన్ 10 ట్విస్ట్

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind u19 vs Pak u19 Final Live Streaming: భారత్, పాక్ అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ ఎక్కడ చూడాలి, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
భారత్, పాక్ అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ ఎక్కడ చూడాలి, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
World Bank Loan For Pakistan: పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 104 రివ్యూ... బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల సందడి... కళ్యాణ్ తలకు గాయం... చివర్లో సీజన్ 10 ట్విస్ట్
బిగ్‌బాస్ డే 104 రివ్యూ... బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల సందడి... కళ్యాణ్ తలకు గాయం... చివర్లో సీజన్ 10 ట్విస్ట్
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Telugu TV Movies Today: ఈ ఆదివారం (డిసెంబర్ 21) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే! డోంట్ మిస్..
ఈ ఆదివారం (డిసెంబర్ 21) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే! డోంట్ మిస్..
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
Embed widget