Tirumala Boy Kidnap: తిరుమలలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం, ఎత్తుకుపోయిన మహిళ - కెమెరాల్లో రికార్డు
Tirumala News: శ్రీవారి ఆలయం ఎదురుగా కూర్చొని ఉండగా బాలుడిని ఓ గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
Five Years Old Boy Kidnaps In Tirumala: ఏడు కొండలపై మరోమారు ఐదేళ్ళ బాలుడు కిడ్నాప్ కావడం కలకలం రేపుతోంది. తిరుపతి ధామినేడుకు కొత్త ఇండ్లు చెందిన వెంకటరమణ, స్వాతి దంపతుల ఐదేళ్ళ కుమారుడు గోవర్థన్ అలియస్ చింటూ నిన్న (ఆదివారం) సాయంత్రం శ్రీవారి ఆలయం ముందు కిడ్నాప్ కు గురి అయ్యాడు.. కిడ్నాప్ కు గురైన బాలుడు తండ్రి వెంకటరమణ తిరుమలలోని ఓ హోటల్ పని చేస్తుండగా, బాలుడు తల్లి స్వాతి భక్తులకు నామాలు పెట్టుకుని వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవారు.
ఈ క్రమంలో నిన్న సాయంత్రం 5:45 సమయంలో బాలుడు తల్లి ఆలయం ముందు భక్తులకు నామాలు పెడుతూ ఉండగా, బాలుడు ఆలయం ముందు కూర్చుకుని ఉండగా గుర్తు తెలియని మహిళ బాలుడుని కిడ్నాప్ చేసింది.. బాలుడు కనిపించక పోయే సరికి స్వాతి విషయంను భర్తకు తెలియజేసి తిరుమలలో గాలించారు.. కానీ, బాలుడు కనిపించక పోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ కెమెరాల ఆధారంగా బాలుడిని మహిళ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.. అయితే, బాలుడిని అపహరించిన మహిళ నిన్న సాయంత్రం 6:15 సమయంలో తిరుమలలోని రాంభగీచ బస్టాండ్ లో తిరుమల నుండి తిరుపతికి వెళ్ళేందుకు ఏపీ 03 జడ్ 0300 నెంబరు గల ఆర్టీసీ బస్సు ఎక్కి రాత్రి 7:16 నిమిషాలకు తిరుపతికి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా మహిళను గుర్తించేందుకు పోలీసుల బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#TirumalaBoyKidnap తిరుమలలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం, ఎత్తుకుపోయిన మహిళ - కెమెరాల్లో రికార్డు#Tirumala #TTD #Kidnaphttps://t.co/LqO88nAm3x
— ABP Desam (@ABPDesam) May 2, 2022
శ్రీవారి సేవలో శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ గవర్నర్
తిరుమల శ్రీవారిని శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ గవర్నర్ జీవన్ త్యాగరాజా దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని ఆశీస్సులు పొందారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం గవర్నర్ జీవన్ త్యాగరాజ మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులు చక్కదిద్దుకోవాలని దేశ ప్రజలకు శాంతిని ప్రసాదించాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.