By: ABP Desam | Updated at : 02 Aug 2022 01:43 PM (IST)
తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్న కేఏ పాల్
రాయలసీమను దోచుకొనే దొంగలు పొలిటికల్ నాయకులని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. గతంలో రాష్ట్రానికి సీఎంగా చేసిన వారంతా రాయలసీమ వాసులేనని గుర్తు చేశారు. మొత్తానికి రాయలసీమను రాక్షససీమగా రాజకీయ నాయకులు మార్చారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా వారేనని, వైఎస్ఆర్, జగన్ కడప జిల్లా వాళ్ళు అని అన్నారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్ లో కేఏ పాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
వాళ్లు నాకు పాదపూజ చేశారు
కమ్మ వాళ్ళు తనకు సపోర్ట్ చేస్తున్నారని కేఏ పాల్ అన్నారు. చంద్రబాబు వల్ల ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తోందని వ్యాఖ్యలు చేశారు. గత వారం రోజులుగా తనపై లేని స్టోరీలు సృష్టించారని.. తన వాహనాలకు బిల్లు కట్టలేదంటూ ప్రచారం సాగుతోందని అన్నారు. ‘‘చంద్రబాబు మా బి ఫార్మ్స్ దొంగలించారు. నేను శపిస్తే చంద్రబాబు నాశనం అయిపోతాడు. నరేంద్ర మోదీ తిరుపతికి వచ్చి స్వామి వారి పాదాల వద్ద హామీలు ఇచ్చారు.. ఎన్నికలు అయ్యాక స్వామి వారినే మోసగించారు. పాలకులు మనల్ని మోసగించి, ఏపీని సుడాన్, శ్రీలంక, నైజిరియా చేస్తున్నారు. నరేంద్ర మోదీ 120 సార్లు నాకు పూల మాల వేశారు. చంద్రబాబు, కేసీఆర్ సహా ఇతర రాజకీయ ప్రముఖులు మాకు పాద పూజ చేశారు.
చంద్రబాబు టీడీపీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి. విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది. కేసీఆర్ కుటుంబ పాలనా, దుష్ట పాలనా, అధర్మ పాలనా చేస్తూ ఆంధ్రులను దూషిస్తున్నారు. చాలా సార్లు కేసీఆర్ నా పాదాలు తాకి పాదపూజ చేశారు. రాష్ట్రాలు భ్రష్టు పట్టడానికి రాజకీయ నాయకులే కారణం. కాకినాడలో నా కార్లు సీజ్ అయ్యాయని దుష్ప్రచారం చేశారు. కోట్ల రూపాయలు అప్పు ఉందని, అందుకే సీజ్ చేశారని అంటున్నారు. అంతా అబద్ధమే’’
‘‘ఏపీ, తెలంగాలో అధికారంలోకి రాబోయేది ప్రజాశాంతి పార్టీనే. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, సినీ యాక్టర్ల కన్నా నాకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. చంద్రబాబు, జగన్, కేసీఆర్, కాంగ్రెస్ కుటుంబ పార్టీలను చిత్తు చిత్తుగా ఓడిస్తాం. ఓట్లు అన్ని ప్రజా శాంతి పార్టీకే వెయ్యండి. ఏపీలో ఓ మంచి మహిళను సీఎం చేస్తా, తెలంగాలో నేను సీఎం అవుతా. మాటలు రాని నా కొడుకుని సీఎం చేస్తా. తాను పీఎం అవుతా అని 2019 ఎన్నికల్లో చంద్రబాబు విర్రవీగాడు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం చిత్తుగా ఓడిపోతుంది. 175 స్థానాల్లో వైసీపీకి డిపాజిట్ కూడా రాదు.
నాతో కలిస్తే పవన్ ని సీఎం చేస్తా
2014 ఎన్నికల్లో పొరపాటు, తప్పు చేశాను. పవన్ కళ్యాణ్ నాతో వస్తే కలసి వెళ్తాం. నిజంగా ముఖ్యమంత్రి అవ్వాలంటే నాతో రా తమ్ముడు పవన్. కావాలంటే నేనే మీ ఇంటికి వస్తా. నన్ను మీ ఇంటికి పిలువు. నాతో పవన్ కలవక పోతే ఎమ్మెల్యేగా కూడా గెలువలేడు.
తెలంగాణలో నా పార్టీ, నేను అడుగు పెట్టిన అనంతరం కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదు. దేవుడి తప్ప ఎవరికి భయపడను.. ప్రజలందరి గుండెల్లో నేను ఉన్నా. కేసీఆర్ నువ్వు నీ కొడుకుని అదుపులోపెట్టుకో. కేసీఆర్ నువ్వు ఒంట్లో భయం పెట్టుకో. తెలంగాణకు నేను కాబోయే సీఎం అని అందరికి తెలుసు. నేను శపిస్తే కేసీఆర్ నాశనం అవుతాడు. బీసీ మహిళ, కాపు, దళిత మహిళలను నా పార్టీలో అవకాశం కల్పిస్తా’’ అని కేఏ పాల్ మాట్లాడారు.
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
IAS Transfers: ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ - కొత్త పోస్ట్ క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - నిన్న ఒక్కరోజులో శ్రీవారి హుండీకి ఆదాయం ఎంతంటే !
Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ
Petrol-Diesel Price, 13 August: ఈ నగరంలో బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక ఆన్లైన్లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!
చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?