అన్వేషించండి

Tirumala News: భక్తుల లగేజీ విధానంలో టీటీడీ కొత్త మార్పులు

భక్తులకు సులభతరంగా టీటీడీ ఎన్నో సదుపాయాలను ముందుకు తెస్తోంది. యూపీఐ పేమెంట్ విధానం నుంచి గదుల కేటాయింపు, టిక్కెట్ల కొనుగోలులో సమూల మార్పులు తీసుకొచ్చింది టీటీడీ.

Tirumala TTD News: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో టీటీడీ ఎప్పుడు ముందే ఉంటుంది. అత్యాధునిక సదుపాయాలతో... భక్తులకు సులభతరంగా టీటీడీ ఎన్నో సదుపాయాలను ముందుకు తెస్తోంది. యూపీఐ పేమెంట్ విధానం నుంచి గదుల కేటాయింపు, టిక్కెట్ల కొనుగోలులో సమూల మార్పులు తీసుకొచ్చింది టీటీడీ.

నడక మార్గంలోను భక్తుల లగేజ్  భద్రపరిచే ప్రాంతాల్లో టోకెన్ ఇచ్చే విధానానికి టీటీడీ స్వస్తి పలికింది. అదే స్థానంలో క్యూఅర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తూసుకొచ్చింది. క్యూ అర్ కోడ్ ద్వారా వీలైనంత త్వరగా భక్తుల లగేజ్ బ్యాగులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఇదే అంశంపై టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.....శ్రీవారి భక్తులుకు సులభతరంగా వుండేందుకు నడకదారి భక్తుల లగేజిని టిటిడి ఉచితంగా తరలిస్తూందన్నారు.

శ్రీవారి భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం లగేజీ విధానంలో అధునాతన మార్పులు తీసుకొని వచ్చింది. లగేజీ కేంద్రాల్లో ఇబ్బందులు అధిగమించేందుకు టీటీడీ సెక్యూరిటీ, దాతల సహకారంతో కొత్త సాఫ్ట్ వేర్ ను తీర్చిదిద్ది.  లగేజీ సెంటర్ కు బాలాజీ బ్యాగేజ్ సెంటర్ గా నామకరణం చేసింది. 

గతంలో లగేజి తరలింపు… తిరిగి అప్పగించడం మ్యానువల్ పద్దతిలో నిర్వహించామని చెప్పారు. ఆధునాతనమైన పద్దతిలోలగేజిని భక్తులుకు అప్పగించే విధానాని అమలులోకి తీసుకువచ్చామన్నారు. దాతల సహకారంతో ఈ విధానాని అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. క్రిస్టియన్ భక్తుడైన చార్లస్ 2 కోట్లు విరాళంగా అందించారని. గతంలో బర్డ్ హస్పిటల్స్ కి 5 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు.16 ప్రాంతాల్లో....44 కౌంటర్లలో....300 మంది సిబ్బందితో ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నమన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు సౌలభ్యంగా ఉండడానికి వారి దగ్గర నుంచి లగేజ్ ని తీసుకొని తిరుమలకు తెచ్చి భక్తులకు ఇచ్చేవాళ్లం. ఇప్పటివరకు కూడా అలా  మాన్యువల్ గా చేసేవాళ్లం. ఆది కాంట్రాక్ట్ పద్ధతిలో చేయడంతో ఆశించిన ఫలితాలు రాలేవు. కరోనా కారణంగా బ్యాగేజీ హ్యాండ్లింగ్ పూర్తిగా తీసివేసాం. కరోనా వల్ల తిరుమలకు భక్తులు రాకపోవడంతో ఈ కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయడం జరిగింది. కరోనా తరలింపు తర్వాత కాంట్రాక్టు పద్ధతిని ఇవ్వడం మానేశాం.

కాంట్రాక్ట్ పద్ధతిలో అధిక భారం అవుతుందని గ్రహించి భక్తుల లగేజీని పూర్తిగా మేనేజ్ చేయాలని ఉద్దేశంతో కొందరి పని వాళ్ళని తీసుకున్నాం. ఇదంతా మాన్యువల్ గా చేయడానికి కష్టం అవుతుండడంతో లగేజ్ బ్యాగు కు ఒక యూనిట్ నెంబర్ ఇచ్చి దాని ట్రాక్ చేయడానికి వీలుగా ఉండటానికి అంటే మన బ్యాగ్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. 

ఈ విధంగా చేయడం వల్ల భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలవకుండా ఉంటుంది. అంతేకాకుండా తమ వస్తువులను పోగొట్టకుండా ఉండటానికి ఇది దోహదపడుతుంది. ఎయిర్ పోర్ట్ లో ఎలాగైతే చెక్ చేస్తారో ఆ విధంగా ఈ పద్ధతి ఉంటుంది.  దీంతో భక్తులకు సమయం కూడా తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెబుతున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Embed widget