అన్వేషించండి

Tirumala News: నవంబర్ 9న యూరప్ లో వేడుకగా శ్రీనివాస కళ్యాణాలు ప్రారంభం

Tirumala news: తిరుమల శ్రీవారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేయడం లో భాగంగా టీటీడీ సహకారంతో యూరప్ లో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సాగుతున్నాయి.

Tirupati News: నవంబర్ 9 నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు యూరప్ లో శ్రీనివాస కళ్యాణాలు జరపాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో యూకే, ఐర్లాండ్, యూరప్‌ (Europe)లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో శ్రీ శ్రీనివాస కళ్యాణాలను ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమ నిర్వాహకులైన సూర్య ప్రకాష్ వెలగా, కృష్ణ జవాజీ జర్మనీ, ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి టీటీడీ ఈవో జె శ్యామలరావును మంగళవారం (అక్టోబర్ 29) ఉదయం తిరుపతి పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. విదేశాలలో ఘనంగా నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణాలలో పాల్గొనాలని ఆహ్వానించారు.

అనంతరం వారు యూకే, ఐర్లాండ్‌, యూరప్‌లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో నవంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 21 వరకు టీటీడీ సహకారంతో స్థానిక స్వచ్ఛంద, సాంస్కృతిక సంస్థలతో కలిసి ఏపీ ఎన్ ఆర్ టీ ఎస్ శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈవోకు తెలిపారు. ఈ తిరు కళ్యాణ కార్యక్రమాలని టీటీడీ వేద పండితులు, వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించనున్నారు. 

యూకే, ఐర్లాండ్, ఐరోపాలలో శ్రీనివాస కళ్యాణాల షెడ్యూలు :

•  నవంబర్ 9 -  బెల్ఫాస్ట్, ఐర్లాండ్ 

•  నవంబర్ 10- డబ్లిన్, ఐర్లాండ్ 

•  నవంబర్ 16- బేసింగ్‌స్టోక్, యూకే 

•   నవంబర్ 17 - ఐండ్‌హోవెన్, నెదర్లాండ్స్ 

•  నవంబర్ 23-  హాంబర్గ్, జర్మనీ 

•  నవంబర్ 24 - పారిస్, ఫ్రాన్స్ 

•  నవంబర్ 30-  వార్సా -  పోలాండ్ 

•  డిసెంబర్ 1 - స్టాక్‌హోమ్, స్వీడన్ 

• మిల్టన్ కీన్స్, యూకే – 7వ డిసెంబర్ 2024

•  డిసెంబర్ 8 - గ్లౌసెస్టర్, యూకే

•  డిసెంబర్ 14 - ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ

•  డిసెంబర్ 15- బెర్లిన్, జర్మనీ 

•  డిసెంబర్ 21. - జ్యూరిచ్, స్విట్జర్లాండ్

Also Read: Diwali 2024 Wishes : దీపావళి 2024 శుభాకాంక్షలను ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఇలా చెప్పేయండి.. సోషల్ మీడియాలో షేర్ చేసేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma letter: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ  బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
IND v NZ 3rd ODI Highlights: మూడో వన్డేలో స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ భారత్‌దే
IND v NZ 3rd ODI Highlights: మూడో వన్డేలో స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ భారత్‌దే
KTR: కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
Suriya: జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్
జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP DesamKerala CM Convoy Accident | సీఎం పినరయి విజయన్ కు తృటిలో తప్పిన ప్రమాదం | ABP Desamవిజయ్‌ పైన కూడా ఏసేశారుగా! తలపతికి పవన్ చురకలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma letter: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ  బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
IND v NZ 3rd ODI Highlights: మూడో వన్డేలో స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ భారత్‌దే
IND v NZ 3rd ODI Highlights: మూడో వన్డేలో స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ భారత్‌దే
KTR: కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
Suriya: జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్
జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్
Kapil Dev Meets Chandrababu: అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ - చర్చించిన చంద్రబాబు, కపిల్ దేవ్
అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ - చర్చించిన చంద్రబాబు, కపిల్ దేవ్
Revanth Reddy: ఏమీ చేయకపోతే రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారు? - ఫామ్‌హౌస్ కేసుపై రేవంత్ సూటి ప్రశ్న
ఏమీ చేయకపోతే రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారు? - ఫామ్‌హౌస్ కేసుపై రేవంత్ సూటి ప్రశ్న
Diwali 2024: దీపావళికి టపాసులు కాల్చడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా!
దీపావళికి టపాసులు కాల్చడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా!
APPLE News: యాపి‌ల్ సంస్థకు లోకేష్ భారీ అఫర్‌- ఏపీలో కోరుకున్న చోట స్థలం ఇచ్చేందుకు అంగీకారం 
యాపి‌ల్ సంస్థకు లోకేష్ భారీ అఫర్‌- ఏపీలో కోరుకున్న చోట స్థలం ఇచ్చేందుకు అంగీకారం
Embed widget