అన్వేషించండి

Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

Tirumala Hundi Incoem: తిరుమల శ్రీవారి  సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సెప్టెంబర్ 14వ తేదీ ఒక్కరోజే 72 వేల 540 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 4.91 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

Tirumala Hundi Incoem: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సెప్టెంబర్ 14వ తేదీ బుధవారం ఒక్క రోజే 72,540 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 33,339 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. నిన్నస్వామి వారి హుండీ ఆదాయం 4.91 కోట్లు లభించింది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 31 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా, స్వామి వారి సర్వదర్శనం కోసం దాదాపుగా 18 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది. అయితే ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుంచి స్వామి వారికి పూలంగి సేవను చేయడం ఆనవాయితీగా వస్తోంది. స్వామి వారిపై ఉన్న ఆభరణాలన్నీ తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు. దీనినే పూలంగి సేవ అని కూడా పిలుస్తారు. ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామి వారు భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు.

మొదటి నివేదనగా పచ్చి పాలు..

శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం వైఖానస భగవచ్చాస్త్ర ప్రకారం అర్చకులు అనేక వైదిక కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారాలు తెరిచి.. బంగారు వాకిలి వద్ద సుప్రభాత శ్లోకాల పఠనంతో వేద పండితులు స్వామి వారిని మేలు కొల్పుతారు. వైఖానస అర్చకులు సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాధనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు. అంతకుముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి.. వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నీరాజనం సమర్పణ జరుగుతుంది. దీనికే కైంకర్యపరుల హారతి అని కూడా పిలుస్తారు.

ముందుగా బ్రహ్మ తీర్థం స్వీకరణ..

శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. ఆ తర్వాత శ్రీవారికి గొల్ల హారతి సమర్పించి.. తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని స్వీకరిస్తారు. అనంతరం జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థాన్ని అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాల పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. అటు తర్వాత మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్లపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనాన్నే విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేస్తారు. ఈ తంతుతో తోమాల సేవ ప్రారంభం అవుతుంది. ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధా క్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు.

కొలువు శ్రీనివాసమూర్తి సమక్షంలో దర్బార్ నిర్వహణ..

శ్రీవారి మూలవిరాట్‌కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం, అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అటుతరువాత వక్షఃస్ధల లక్ష్మీ, పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి, శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. దీంతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు.

నక్షత్ర హారతి.. 

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. ఆ తర్వాత సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్ర నామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన జరిపిస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు చేస్తారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహిస్తారు. అనంతరం గురువారం తిరుప్పావడ సేవను నిర్వహించిన అనంతరం సర్కారు వారి హారతి జరిపి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను అనుమతిస్తారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు.

ఘనంగా పూలంగి సేవ..

అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీత్ లగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామి వారి ఒంటిపై ఉన్న ఆభరణాలన్నీ తొలగించి శాస్త్రోక్తంగా అర్చకులు పూలంగి సేవను జరిపిస్తారు. అటు తరువాత డోలోత్సవం సేవను అద్దాల మండపంలో నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల వల్ల వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వారికి అర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఊంజల్ సేవను నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవం జరిపిస్తారు. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి తీసుకొస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలు అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల, రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహిస్తారు. అటు తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
High Court: ఆ 106 మంది ఉద్యోగులకు ఊరట - విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు
ఆ 106 మంది ఉద్యోగులకు ఊరట - విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
ITR 2024: ఐటీఆర్‌ను ఇప్పుడు సబ్మిట్‌ చేయాలా, ఆగాలా? - ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెప్పారు?
ఐటీఆర్‌ను ఇప్పుడు సబ్మిట్‌ చేయాలా, ఆగాలా? - ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెప్పారు?
Embed widget