అన్వేషించండి

Tirumala Updates: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల‌ రద్దీ - నేడు శ్రీవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పణ

Tirumala Latest News: సర్వదర్శనం భక్తులతో తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయాయి. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ కొనసాగుతుంది. ప్రతి మంగళవారం స్వామి వారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం 17-10-2022 రోజున 70,067 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 33,092 మంది తలనీలాలు సమర్పించగా, 4.61 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయాయి. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 

సర్కారు హారతి తరువాత వీఐపీ దర్శనం
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవ విశేషం. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు. 

సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
Embed widget