అన్వేషించండి

Srikalahasti News: బొజ్జల సుధీర్ వర్సెస్ సీఐ - టీడీపీ కార్యకర్తను తన్నారంటూ పోలీస్ స్టేషన్ ముట్టడి, క్షమాపణకు డిమాండ్

కమ్మకొత్తూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడి బూటు కాలుతో రూరల్ సీఐ అజయ్ కుమార్ తన్నడంపై బొజ్జల సుధీర్ తమ కార్యకర్తను ఎందుకలా చేశావంటూ ప్రశ్నించారు.

Bojjala Sudhir Reddy Protest at Srikalahasti Police Station:

శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లాలో టీడీపీ వర్సెస్ సీఐగా వివాదం‌ కొనసాగుతోంది. శ్రీకాళహస్తి పట్టణంలోని తొట్టంబెడు పోలీస్ స్టేషన్ ని టీడీపీ కార్యకర్తలతో కలిసి బొజ్జల సుధీర్ రెడ్డి ముట్టడించారు.. కమ్మకొత్తూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడి బూటు కాలుతో రూరల్ సీఐ అజయ్ కుమార్ తన్నడంపై బొజ్జల సుధీర్ తమ కార్యకర్తను ఎందుకలా చేశావంటూ ప్రశ్నించారు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన నడిచింది. అయితే ఈ వాదనలో సీఐ అజయ్ కుమార్ బొజ్జల సుధీర్ పై మండిపడ్డారు. 

చేసిన తప్పు ఒప్పుకుని పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని సుధీర్ సీఐని డిమాండ్ చేశారు. కానీ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరికి ఫిర్యాదు చేసినా తాను భయపడనంటూ రూరల్ సీఐ అజయ్ కుమార్ చెప్పడంతో ఆగ్రహించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తన పార్టీ టీడీపీతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పోలీసు స్టేషన్ ను‌ ముట్టడించారు. టీడీపీ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడి, భౌతిక దాడులకు పాల్పడ్డ సీఐ అజయ్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలుపుతూ బైఠాయించారు. 

టీడీపీ, జనసేన శ్రేణుల నిరసనతో రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తతగా మారడంతో సమాచారం అందుకున్న డీఎస్పీ భీమారావు స్టేషన్ వద్దకు చేరుకుని విషయం అడిగి తెలుసుకున్నారు.. సీఐ అజయ్ కుమార్ ను సస్పెండ్ చేయాలని, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని సుధీర్ రెడ్డి చెప్పడంతో డీఎస్పీ శాంతించాలని కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో తిరుపతి‌ ఎస్పీ పరమేశ్వర రెడ్డితో బొజ్జల సుధీర్ రెడ్డి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, బూటు కాళ్లతో తన్నడంపై బొజ్జల సుధీర్ రెడ్డి ఎస్పీకి వివరించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలి, సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Australia Vs India 1st Test Scorecard: పెర్త్‌ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్‌- టాప్ స్కోరర్‌గా నితీశ్‌
పెర్త్‌ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్‌- టాప్ స్కోరర్‌గా నితీశ్‌
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Zomato: జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
Embed widget