అన్వేషించండి

Chandrababu Security: కుప్పంలో పర్యటన ఎఫెక్ట్ - టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు

ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం భధ్రత పెంచుతూ NSG DG ఉత్తర్వులు చేయగా, నిన్ననే అమరావతిలోని చంద్రబాబు ఇంటిని, టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు పరిశీలించారు.

చిత్తూరు : జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడుకు 12+12 కమాండోలతో భధ్రత పెంచింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం భద్రత పెంచుతూ NSG DG ఉత్తర్వులు చేయగా, నిన్ననే అమరావతిలోని చంద్రబాబు ఇంటిని, టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ఎన్.ఎస్.జీ డిజీ స్వయంగా పరిశీలించారు. అంతే కాకుండా టీడీపీ కార్యాలయంలోని నాయకులతో మాట్లాడి స్ధానిక పోలీసు అధికారుల భద్రత ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పర్యటిస్తున్న క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు వంటివి అధికం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు భద్రతపై ఎన్.ఎస్.జీ ప్రత్యేక దృష్టి సారించింది. కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేస్తున్న చంద్రబాబుకి 12+12 భద్రత ఏర్పాటు చేసింది.

చంద్రబాబు రోడ్ షో మార్గంలో భరత్ నివాసం.. 
చంద్రబాబు నేడు పాల్గొనే రోడ్ షో మార్గంలోనే వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇల్లు కూడా ఉంది. దాంతో పోలీసులు, చంద్రబాబు భద్రతా సిబ్బంది ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. మరోవైపు ఎమ్మెల్సీ భరత్ కూడా తన నివాసంలోనే ఉండటంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనీఖి చేసిన తరువాతే వాహనాలను అనుమతిస్తున్నారు. నిన్న అన్నా క్యాంటీన్ ప్రారంభానికి ముందే వైసీపీ శ్రేణులు అక్కడ విధ్వంసానికి పాల్పడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కుప్పంలో మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు.. 
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన మూడు రోజుల పర్యటన బుధవారం (ఆగస్టు 25) ప్రారంభం అయింది. తొలి రోజు రామకుప్పం మండలంలోని కొంగనపల్లె, కొళ్లుపల్లె, శివునికుప్పం, చల్దిగానిపల్లెల్లో చంద్రబాబు పర్యటించారు. గురువారం కుప్పంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి, టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. లోపలి ఫ్లెక్సీలను చింపేశారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద టేబుళ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణంలో పర్యటన కొనసాగుతోంది. పలుచోట్ల ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు తోపులాటలు, రాళ్ల దాడులకు దారి తీసింది. రెండో రోజు చంద్రబాబు పర్యటనలో‌ భాగంగా గురువారం ఉదయం చంద్రబాబు అన్న క్యాంటీన్ ను ప్రారంభించాల్సి ఉండగా, వైసీపి నాయకులు క్యాంటీన్ ధ్వంసం చేసి బందుకు వైసిపి పిలుపు ఇవ్వడంతో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కుప్పంలో టీడీపీ నేతలపై భారీగా కేసులు నమోదు చేశారు పోలీసులు. 

Also Read: Chandrababu Kuppam Tour: టీడీపీ నేతలపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Embed widget