అన్వేషించండి

Padmavathi Ammavari Teppotsavam 2024: జూన్ 17 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు, ఆర్జిత సేవలు రద్దు

Padmavathi Teppotsavam 2024: శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవం 5 రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 17 నుంచి 21 వరకు జరగనున్న తెప్పోత్సవం సందర్భంగా 5 రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు.

Tiruchanoor Padmavathi Teppotsavam TTD Telugu News | తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. జూన్ 17 నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆగమపూజలు అందుకుని భక్తులకు అనుగ్రహం 
ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల మనకు సూచిస్తున్నాయి.

ఐదు రోజుల షెడ్యూల్ ఇదే 
జూన్ 17వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి తెప్పలపై విహరిస్తారు. ఇక రెండో రోజు జూన్ 18న శ్రీ సుందరరాజస్వామి తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారు. చివరి మూడు రోజులు జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి 3 రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించ‌నున్నారు. అమ్మవారికి జూన్ 20వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహనం, జూన్ 21వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడ వాహనసేవ నిర్వ‌హిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :
తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, జూన్ 21న ల‌క్ష్మీ పూజ‌ను రద్దు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
Also Read: రాముడు, భీష్ముడు, పరశురాముడు, శ్రవణకుమారుడు..వీరి ప్రతి అడుగు నాన్నకు ప్రేమతో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget