అన్వేషించండి

Tirumala Update: శ్రీవారి భక్తులకు అలర్ట్, తిరుమలలో 10 రోజులపాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు

Vaikunta Ekadasi 2025 Date And Time | అసలే స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. ఈ క్రమంలో వైకుఠ ద్వార దర్శనం చేయడానికి తిరుమలకు

No special darshan at Tirumala Temple from 10 January to 19 | తిరుమల: వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలను ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. పది రోజులపాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. జనవరి 10వ తేదీన ఉదయం 4:30 గంటలకు వీఐపీ దర్శనాలతో స్వామివారి దర్శనం ప్రారంభం అవుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే ఈ పది రోజుల్లో 7.50 లక్షల మందికి దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేశాం. కాలిబాటలో జనవరి 19 వరకు ఎలాంటి ఎలాంటి టోకెన్లు జారీ చేయడం లేదని స్పష్టం చేశారు.

టీటీడీ ఈవో శ్యామలరావు ఇంకా చెప్పారంటే..
జనవరి 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. జనవరి 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు వాహన మండపంలో మలయప్పస్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. జనవరి 11న ఉదయం 5:30 గంటలకు చక్రస్నాన మహోత్సవం నిర్వహిస్తాం. తిరుపతిలో సర్వదర్శన 9 తేదీన ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. మిగతా టోకెన్లు రోజువారీగా మూడు కేంద్రాల్లో జారీ చేయనున్నాం. శ్రీవారి సర్వ దర్శన భక్తుల దర్శనం జనవరి 10న ఉదయం 8 గంటల ప్రారంభం అవుతుంది. దాదాపు 3 వేల మంది పోలీసులు, 15 వందల మంది సిబ్బందితో వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తులకు భద్రత కల్పించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ పది రోజుల సమయంలో స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని, ప్రత్యేక దర్శనాలకు అనుమతించడం లేదని టీటీడీ ఈవో తెలిపారు.

నేడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

నేడు తిరుమల ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏటా నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. మొదట తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా తొలిసారి, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం పర్వదినం, వైకుంఠ ఏకాదశి పర్వదినం ముందు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుపుతారు. మంగళవారం (జనవరి 7న) జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ ఈవో జే శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

Also Read: Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి మొదలు.. భారీగా పెరిగిన రద్దీ, భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం!

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget