![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kanipakam Temple: కాణిపాకంలో ఉదయాస్తమాన సేవ ప్రారంభించిన స్వరూపానందేంద్ర సరస్వతి
Kanipakam Temple: కాణిపాకం ఆలయంలో లక్ష మోదక లక్ష్మీ గణపతి హోమాన్ని ఘనంగా జరిపించారు. ఈ క్రమంలోనే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామి ఉదయాస్తమాన సేవను ప్రారంభించారు.
![Kanipakam Temple: కాణిపాకంలో ఉదయాస్తమాన సేవ ప్రారంభించిన స్వరూపానందేంద్ర సరస్వతి Knaipakam Temple Swarupanandendra Saraswati started The Udayasthamana service at Kanipakam temple Kanipakam Temple: కాణిపాకంలో ఉదయాస్తమాన సేవ ప్రారంభించిన స్వరూపానందేంద్ర సరస్వతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/05/aae72730b78a6f8a29608ad45429b8be1678024668937519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kanipakam Temple: కాణిపాకం ఆలయంలో లక్ష మోదక లక్ష్మీ గణపతి హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ శారదా పీఠం స్వరూపానంద సరస్వతి స్వామి నేటి నుంచి కాణిపాకంలో ఉదయాస్తమాన సేవను ప్రారంభించారు. ఈ సేవ టికెట్ ధర లక్ష రూపాయలుగా ఆలయ అధికారులు, పాలక మండలి నిర్ణయించింది. అనంతరం చైర్మన్ గెస్ట్ హౌస్ లో ఉన్న స్వరూపా నందేంద్ర సరస్వతి, స్వత్మ నరేంద్ర సరస్వతి వారిని దర్శించుకోవడానికి పలువురు రాజకీయ నేతలు వచ్చారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి ఎంపీ గురుమూర్తి, జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, కొంత మంది ప్రముఖులు స్వామి వారిని మర్యాద పూర్వకంగా కలశారు. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. కాణిపాకం ఆలయానికి సంబంధించి పబ్లిక్ రిలేషన్ ఆఫీసును కూడా ప్రారంభించి, తర్వాత వినాయక స్వామి వారి మూల విరాట్టు దర్శించుకొని, యాగశాలలో జరుగుతున్న లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము కార్యక్రమంలో పాల్గొన్నారు.
లక్ష మోదక లక్ష్మీ గణపతి వ్రత వహనం వల్ల రాష్ట్రానికి మంచి..
కాణిపాకం ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక హోమానికి.. మూడో రోజులు భాగంగా నేడు యాగశాలలో స్వరూపానందేంద్ర సరస్వతి, స్వత్మ నందేంద్ర సరస్వతి, సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్రోత్తకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్, ఈఈ వెంకట నారాయణ, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విశాఖ శారదా పీఠం స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి వారు మీడియాతో మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ప్రజలందరూ బాగుండాలని ఉద్దేశంతో, లక్ష మోదక లక్ష్మీ గణపతి వ్రత హవనము చేయడం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతందని అన్నారు. ఏపీ రాష్ట్రానికి కొన్ని కంపెనీలు వచ్చి 13 లక్షల కోట్లు రూపాయల పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.
అలాగే లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము వలన రాష్ట్రానికి అంతా మంచే జరుగుతుందని.. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ హోమం జరిపిచంగా.. దిగ్విజయంగా పూర్తయిందని వెల్లడించారు. యాగము పరి పూర్ణంగా పూర్తయినందు వలన దానికి ఆ దేవుడు అనుగ్రహం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి ఓ భక్తులు భారీ విరాళాలు, తమకు తోచిన కానుకలు సమర్పించుకుంటారు. తాజాగా టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదని ట్రస్టుకు భారీ విరాళం అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన సరోజినీ వడ్లమూడి అనే భక్తురాలు కోటి రూపాయల భారీ విరాళం అందజేశారు. టీటీడీ అధికారులకు విరాళానికి సంబంధించిన డీడీని ఆమె అందచేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా శని, ఆది వారాల్లో స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులకు తరలి వస్తుంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)