అన్వేషించండి

Jabardasth Hari: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జబర్దస్త్ మాజీ కమెడియన్! పరారీ, పోలీసుల గాలింపు

గతంలో కూడా హరిబాబు పేరు స్మగ్లింగ్ విషయంలో తెరపైకి వచ్చింది. 2021 మే నెలలో చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోనూ స్మగ్లింగ్ గ్యాంగ్ ను పట్టుకున్నారు.

జబర్దస్త్ కామెడీ షోలో కొన్నేళ్ల క్రితం కమెడియన్ గా పని చేసిన హరిబాబు అనే వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు. చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ.60 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ తరలింపు వ్యవహారంతో హరిబాబుకి సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న జబర్దస్ హరిబాబు కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇతనిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలివీ..

శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనంను విదేశాలకు అక్రమంగా తరలించి కొందరు కోట్లు గడిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతున్నా ఎర్రచందనం స్మగ్లర్స్ మాత్రం సరికొత్త ప్రణాళికతో విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ కామెడియన్ హరిబాబు హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కమెడియన్ హరిబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు జబర్దస్త్  హరిబాబు ఎర్రచందనంను ఎక్కడికి తరలించేవాడో పోలీసులు తెలిపారు.

పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం..  ఆదివారం (జూన్ 11) రాత్రి పుంగనూరు పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు పుంగనూరు శివారు ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఐతే పోలీసులను చూసి రెండు వాహనాలు తప్పించుకునేందుకు ప్రయత్నం చేయగా, గమనించిన పోలీసులు ఆ రెండు వాహనాలను అడ్డగించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ వాహనం డ్రైవర్ పోలీసుల కన్ను కప్పి పరార్ కాగా, మరో వాహనం డ్రైవర్ కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలను తనిఖి చేయగా దాదాపు అరవై లక్షల విలువ గల పంతొమ్మిది ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలను సీజ్ చేశారు.

పోలీసుల అదుపులో ఉన్న కిషోర్ ను విచారించగా ఎర్రచందనం అక్రమంగా భాకరాపేట అటవీ ప్రాంతంలో సేకరించి అక్కడి‌ నుండి కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు సమీపంలోని కటిగనహళ్ళి గ్రామంకు తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ ఆర్టిస్ట్ హరిబాబు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐతే పోలీసులు పరార్ ఐనా ఎర్రచందనం స్మగ్లర్, ప్రధాన సూత్రధారి జబర్దస్త్ కమెడియన్ హరిబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జబర్దస్త్ కమెడియన్ హరిబాబుపై తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసుల వద్ద రెండు కేసుల్లో నిందుతుడిగా ఉండగా, కాణిపాకం పోలీసు స్టేషను పరిధిలో ఒక్క‌ కేసు, ఏర్పేడు పోలీసు స్టేషను పరిధిలో ఒక్క కేసులో నిందుతుడిగా ఉన్నట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.

గతంలోనూ స్మగ్లింగ్ లో హరిబాబు పేరు

గతంలో కూడా హరిబాబు పేరు స్మగ్లింగ్ విషయంలో తెరపైకి వచ్చింది. 2021 మే నెలలో చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని చీకిమానుకోన అటవీప్రాంతంలో రెడ్‌ శాండల్‌ స్మగ్లింగ్‌ అవుతుందన్న సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది దాడులకు దిగారు. ఎనిమిది మంది స్మగ్లర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో జబర్దస్త్‌ హరిబాబు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. హరిబాబుకి పలువురు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పట్లో చీకిమానుకోన అటవీప్రాంతంలో పట్టుబడ్డ స్మగ్లర్ల నుంచి రెండు నాటు తుపాకులతో పాటు మూడు లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్‌ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget