AP Rains: తెలుగు రాష్ట్రాల్లో అంతటా కురిసిన భారీ వర్షాలు, అక్కడ తప్ప! భవిష్యత్ మరింత భయానకం
Andhra Pradesh News | ఉమ్మడి చిత్తూరు జిల్లా లో వర్షాలు లేకుండా డాములు, చెరువులు నీరు తగిపోయాయి. వచ్చే వేసవి కాలంలో నీటి సమస్య ఎకువ ఐయే అవకాసం ఉంది. తిరుమల సైతం ఈ సమస్య ఉంటుంది.
Chittoor News: రాయలసీమ రతనాల సీమ అంటారు.. మరోవైపు కరువు సీమగా మారుతోంది. రాయలసీమ ఎప్పుడు వర్షాలు కోసం ఎదురుచూసే పరిస్థితి. అలాంటి రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షాలు లేక నీటి సమస్య త్వరలో ఉత్పన్నం అయ్యే పరిస్థితి నెలకొంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అధికంగా కురిశాయి. వరదలు వచ్చి లక్షలాది మంది జీవితాలను నీటి పాలు చేస్తున్నాయి.. పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లి అనేక మంది ఏమి చేయాలి దేవుడా.. ఎన్నడు లేని ఈ వర్షాలు ఏమిటని దేవుడుని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ లాంటి మహా నగరం నీటిలో చిక్కుకున్నాయి. సహాయక చర్యలు చేస్తున్న ఇంకా పూర్తి కాకుండానే మరోసారి భారీ వర్షాలు కురిశాయి. ఏపీలో ఈ పరిస్థితి ఉంటే ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం వర్షం లేదు కేవలం అడపాదడపా చిరుజల్లులతో సరిపెడుతుంది.
త్వరలో జిల్లాలో నీటి కష్టాలు
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 2021 సంవత్సరంలో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు నిండిపోయాయి. తిరుపతి లాంటి నగరంలో ఎటు చూసినా నీరే.. రోడ్డు పైకి రావాలంటే బయపడే పరిస్థితి నెలకొంది. ఆ రోజుల్లో కురిసిన వర్షాలకు చెరువులు, డ్యాములు నిండాయి. ఆ నీటిని 2023 వరకు వినియోగించారు. ఆ తరువాత 2023 లో కొద్దిపాటి వర్షం పడడంతో తగ్గిన నీరు వర్షం కారణంగా నిండాయి. అప్పటి నుంచి వినియోగించిన నీరు మరో మూడు నెలల వరకు అందుబాటులోకి వస్తుంది.
నీటి కష్టాలు తప్పవా?
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా లో వేలు చెరువులు ఉన్నాయి. ఇక్కడ వర్షాధారం పైన ఆధారపడి రైతులు పంటలను సాగు చేస్తున్నారు. వర్షాలు లేకపోతే పంటలు పండించడం కష్టం తో కూడుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో చెరువులు, కుంటలు నీరు నిల్వ చేసి పంటలకు ఉపయోగించడం ఇక్కడ రైతుల అలవాటు. ప్రస్తుతం ఉన్న నీరు త్వరలో అయిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలు లేక పోతే ఏమి చేయాలో అనేది రైతులు నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు.
ఇక చిన్న పట్టణాల నుంచి తిరుపతి, చిత్తూరు లాంటి నగరాలకు నీరు సమీపంలోని ప్రాజెక్టుల నుంచి పంపింగ్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ లు ఇప్పటికే చాలా వరకు నీరు అడుగుకు చేరుకున్నాయి. అండర్ గ్రౌండ్ వాటర్ ఉన్న ప్రాంతంల్లో ఉన్న బోర్లు ఆధారంగా కొంత కాలం నీటిని అందించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆ తరువాత నీటి కష్టాలు తప్పవని అధికారులు అంచనాకు వచ్చాయి. ఈ రెండు నెలల కాలంలో వర్షం లేకపోతే నీటి కష్టాలు ప్రారంభమయ్యాయేది మాత్రం నగరాలు, పట్టణాలు తొలి వరుసలో నిలుస్తాయి.
తిరుమలకు నీటి సమస్య
తిరుమలలోని ప్రముఖంగా ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టు లు అన్ని 2021 వర్షాలు... ఆ తరువాత 2023 పడిన వర్షాలతో జలకళను సంతరించుకున్నాయి. ఆ తరువాత వర్షాలు లేక నీరు పూర్తిగా తగ్గిపోయాయి. నీటి సమస్య త్వరలో రానున్న నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే అప్రమత్తం అయ్యింది. నీటి సమస్య తీర్చేందుకు నీటి వృథా ను అరికట్టాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవాల తరువాత నీటి సమస్య గురించి చర్చించి ఏమి చేయాలని నిర్ణయించే అవకాశం ఉంది.
చెరువులు, డ్యామ్ లపై ప్రత్యేక దృష్టి
విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి పారుదల శాఖ, జలవనరుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చెరువులు, వాటికి కావాల్సిన మరమ్మతులు, డ్యాములు పరిశీలించి నీటి సామర్థ్యం వాటి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. వర్షాలు పడితే వరదలు రాకుండా జాగ్రత్తలు పాటించాలని విజయవాడ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. దీంతో ఆయా శాఖల అధికారులు అప్రమత్తమై పనులు సాగిస్తున్నారు.
Also Read: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి