అన్వేషించండి

Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్ చరిత్ర మీకు తెలుసా?

Tirumala News: తిరుమల తిరుపతి మధ్య ప్రయాణం చేసే వారికీ తిరుమల ఘాట్ రోడ్స్ గురించి తెలియదు. అసలు ఆ ఘాట్ రోడ్స్ నిర్మాణం ఎప్పుడు జరిగింది.. ఎవరు చేసారు అనేది మీకోసం

Tirumala Ghat Road History: తిరుమల ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయితే ఆయన దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రకృతి సోయగాలతో ఆహ్లోదాన్ని అందించే వాతావరణం, చల్లటి మంచ్చు దివి నుండి మనపై వాలుతుందా అనేలా చుట్టుకునే మేఘాలు... అనువనువు సహజశిలల శ్రీవారి దర్శనం... ప్రమాదకర మలుపులు అయితే ఏమ్ ఎతైన కొండలు చూస్తూ సాగిపోయే ప్రయాణం. ప్రతిరోజు చూసిన కొత్త అనుభూతిని అందించే తిరుమల ఘాట్ రోడ్డు గురించి మీకు తెలుసా... అసలు ఈ రోడ్లు ఎప్పడు ఏర్పడ్డాయి... ఎవరు వేసారనే విషయాలను ఏబీపీ దేశం మీకు అందిస్తుంది. 

మనము తిరుమలకు వెళ్లాలంటే కాలినడకన లేదా వాహనాల్లో చేరుకోవాలి. ఏళ్ల నాటి నుండి స్వామివారి దర్శనం కోసం వెళ్లాలంటే కాలినడకన దట్టమైన అడవి లో పాదయాత్రగా వెళ్లే వారు... భక్తుల సంఖ్య పెరగడం, తిరుమల కు కావాల్సిన వస్తువులు తీసుకురావడానికి అప్పటి మద్రాసు పాలకుల సూచన మేరకు రోడ్డు వేయాలని నిర్ణయించారు. అయితే తల ఎత్తి చూసే ఎత్తైన కొండల్లో రోడ్డు వేయడం అంటే సాధ్యమేనా అని అందరూ అనుకున్నారు.

నాటి మద్రాసు గవర్నర్ సర్ ఆర్తర్ హోప్ ఈ పనిని ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కు అప్పగించారు. ఈ కొండల్లో సర్వే నిర్వహించి ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వానికి పంపారు. వారి ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో రోడ్డు వేయడం అనేది ఓకే సవాలు అని చెప్పొచ్చు. క్లిష్టమైన పరిస్థితుల్లో రోడ్డు వేసి ఆయనే తొలిసారి ట్రైల్ వేసారని అంటారు. ఆయన వేసిన ఆ రోడ్డు మనం తిరుమల నుంచి తిరుపతి కి వచ్చే రోడ్డు. దాన్ని నేటికి మొదటి ఘాట్ రోడ్డుగా పిలుస్తారు. ఆ రోజుల్లో రాకపోకలు ఆ రోడ్డులోనే సాగేవి. 1944 ఏప్రిల్ 10న అప్పటి మద్రాసు గవర్నర్ ఈ రోడ్డును ప్రారంభించారు. మొత్తం 57 మలుపులుతో నిర్మాణం జరిగింది.

తొలి రోజుల్లో సరకులు, ఇతర వస్తువులు తిరుమలకు తీసుకెళ్లడానికి ఎద్దుల బండ్లు ఉపయోగించే వారు. భక్తుల సంఖ్య పెరగడంతో రెండు బస్సులను ప్రారంభించారు. అవి కూడా ఇదే మార్గం లో ప్రయాణం సాగించేవి. 1961 లో టీటీడీ రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం చేసింది. నాటి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఈ ఘాట్ రోడ్డు కు శంఖుస్థాపన చేశారు. 

మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించిన మొదటి ఘాట్ రోడ్డు నేటికి చెక్కుచెదరకుండా ఎలాగే భక్తులకు అందుబాటులో ఉంది. ఆయన స్పూర్తితో ఇంజినీర్లు మరిన్ని అద్బుతమైన నిర్మాణాలు చేపట్టాలని.. ఏబీపీ దేశం నుంచి ఇంజినీర్లకు ఇంజినీరింగ్ డే శుభాకాంక్షలు.

పిల్లర్లు లేని నిర్మాణం చూసారా..!

సాధారణంగా ఏదైనా నిర్మాణాలు చేపట్టాలంటే పునాదులు తీసీ బలమైన పిల్లర్లు వేసి కావాల్సిన విధంగా అందంగా నిర్మించుకుంటాము. పునాదులు లేని నిర్మాణాలు ఎప్పుడైనా చూసారా... అయితే మీరు తిరుపతి లోని అరుదైన నిర్మాణం చూడాల్సిందే..

తిరుపతి శేషాచలం కొండల కింద శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఆవరణలో పిల్లర్లు లేకుండా నిర్మించిన ఆడిటోరియం ఉంది. ఇదే ఆసియా ఖండంలో రెండో నిర్మాణంగా చెబుతారు. 1970లో SL chitale & sons రూపొందించారని ఆధారాలు ఉన్నాయి. ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ నిర్మాణానికి సలహాలు ఇచ్చారు కొందరు చెబుతారు కాని ఎలాంటి ఆధారాలు లేవు.


Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్ చరిత్ర మీకు తెలుసా?
13500 ఎకరాల విస్తీర్ణంలో ఈ అరుదైన నిర్మాణం తప్పక చూడాల్సిందే. ఈ నిర్మాణం మొత్తం జీను ఆకారంలో ఉండే హైపర్ బోలిక్ పారాబొలాయిడ్ నిర్మాణాన్ని తిరుమల కొండలకు అనుగుణంగా రూపొందించారు. మరి కొందరు ఈ నిర్మాణం డమరుకం ఆఖరం పోలిన విధంగా ఉంటుందని కూడా అంటారు. విండ్ టన్నల్ పరీక్షల తరువాత ఈ నిర్మాణాన్ని 3 అంగుళాల మందం కలిగిన షెల్ ఉంది. ఎలాంటి సాంకేతిక సౌకర్యం లేని సమయంలో ఈ నిర్మాణం చేయడం ఒక అద్భుతమని చెపొచ్చు.

ఈ ఆడిటోరియం లో ఇప్పటివరకు 50 పైగా స్నాతకోత్సవాలు జరిగాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి, రామోజీ రావుతో పాటు 1000 మందికి పైగా గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఇలాంటి అరుదైన నిర్మాణానికి ప్రచారం ఎస్వీయూ అధికారులు కల్పించడం లో కొంత అలసత్వం చూపారని విమర్శలు కూడా ఉన్నాయి.

 


Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్ చరిత్ర మీకు తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
Pushpa 2 Stampede: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
Pushpa 2 Leaked: 'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
Embed widget