అన్వేషించండి

CPI Narayana: జగన్‌ను తక్షణమే అరెస్టు చేయాలి - సీపీఐ నారాయణ డిమాండ్

AP News: ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే జగన్ అవినీతిపై మాట్లాడారని.. జగన్ అవినీతి, అక్రమాలపై మాట్లాడిన మోదీ వెంటనే జగన్ ను అరెస్టు చేయించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.

Narayana Comments on CM Jagan: సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ల్యాండ్, వైన్, శ్యాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే జగన్ అవినీతిపై మాట్లాడారని.. జగన్ అవినీతి, అక్రమాలపై మాట్లాడిన మోదీ వెంటనే జగన్ ను అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. బటన్ నొక్కి నొక్కి చివరకు జగన్ అధికారం కోల్పోతున్నాడని ఎద్దేవా చేశారు. 

‘‘ఎన్నికల తరువాత వ్యక్తిగత ద్వేషాలు అవసరం లేదు. రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్యంసాలకు తెరలేపుతున్నారు. రాజకీయ విధానాలనే జనం నమ్ముతారు.. నిత్యం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వ్యక్తి జగన్. పోలింగ్ కాక ముందు జగన్ ఇంటర్వ్యూ చూశా.. ఓటమి భయం స్పష్టంగా కనిపించింది. పోలింగ్ తరువాత సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో కూడా అధికారం కోల్పోతున్నామన్న ఆవేదన కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ఎపిలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను.

నరేంద్ర మోదీ చేతిలో కేంద్రం ఎన్నికల సంఘం కీలు బొమ్మగా మారింది. చివరి దశలో వారణాసి లాంటి ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నార్త్ లో బిజెపికి సీట్లు రావు. గుజరాత్ లో బీజేపీకి సీట్లు తగ్గుతాయి. యూపీలో అస్సలు రాదు. సౌత్ మీద బీజేపీ దృష్టి పెట్టింది. అందుకే మైండ్ గేమ్ ఆడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఓటర్లలో చైతన్యం వచ్చింది.. బీజేపీని ఓడించిడానికే. మోదీ విధానాలపై విసుగెత్తి జనం ఓట్లు వేశారు.. ఓటింగ్ శాతం అందుకే పెరిగింది. మోదీ పాలనలో నల్లధనం పెరిగింది. దేశ ఆస్తులను అదానీకి మోదీ అప్పచెబుతున్నాడు. 

మోదీ హయాంలో 16 లక్షల కోట్లు ఎగ్గొట్టి 29 మంది విదేశాలకు పారిపోయారు. డ్రగ్స్ సరఫరా మొత్తం అదానీ పోర్ట్ నుంచే అక్రమంగా సాగుతోంది. మోదీ కనుసన్నల్లోనే దేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. తమిళనాడులో బీజేపీకి సీట్లు రావు.. ఏపీలో ఒకటి, తెలంగాణలో ఒక ఎంపీ సీటు మాత్రమే బీజేపీకి వస్తుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ తరహాలో కాంగ్రెస్ నేతలు కూడా కలిసికట్టుగా పనిచేసి ఉంటే బాగుండేది. మోదీపై ఉన్న కోపంతో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేశారు’’ అని సీపీఐ నారాయణ మాట్లాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget