అన్వేషించండి

Chittoor News: పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు, అద్దాలన్నీ ధ్వంసం - ఒక్క ఎలుక వల్లే ఇదంతా

పేలుడు ధాటికి స్టేషన్‌ వెనుకవైపు ఉన్న తలుపులు, కిటికీల అద్దాలు, దగ్గరే చుట్టుపక్కల ఉన్న ఇంటి కిటికీల అద్దాలు పగిలిపోయాయి.

ఓ ఎలుక చేసిన పని ఏకంగా పోలీస్ స్టేషన్ ను గడగడలాడించింది. పెద్ద పేలుడు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంతకీ ఆ ఎలుక ఏం చేసిందో తెలుసా? చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శనివారం ఉదయాన్నే పెద్ద పేలుడు చోటు చేసుకుంది. దీంతో డ్యూటీలో ఉన్న డ్యూటీలో ఉన్న పోలీసులు అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందా అని ఆరే తీస్తే ఆ ప్రాంగణంలో కొంత కాలం క్రితం పాతి పెట్టిన మందుగుండు పొడి పేలింది. అందుకు కారణం ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

నాలుగు సంవత్సరాల క్రితం గంగాధర నెల్లూరు మండల పరిధిలో అక్రమంగా రవాణా అవుతున్న గన్‌ పౌడర్‌ను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని స్టేషన్‌ వెనుక ఉన్న ఓ చెట్టు కింద భద్రంగా పూడ్చి పెట్టారు. పందికొక్కులు, కుక్కలు దాన్ని తవ్వకుండా ముందస్తు జాగ్రత్తగా దానిపై కాంక్రీట్‌ కూడా వేశారు. ఎలుకలు చెట్టు కింద కన్నాలు చేసుకుంటూ, ఆ గన్‌ పౌడర్‌ పాతి పెట్టి ఉన్న స్థలంలోకి కూడా వెళ్లాయి. దీంతో ఆ ఒత్తిడికి శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో భారీ శబ్దంతో పేలుడు జరిగింది. 

దీంతో స్టేషన్‌ వెనుకవైపు ఉన్న తలుపులు, కిటికీల అద్దాలు, దగ్గరే చుట్టుపక్కల ఉన్న ఇంటి కిటికీల అద్దాలు పగిలిపోయాయి. స్టేషన్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారు, సీజ్ చేసి అక్కడే నిలిపిన బైక్ లు సహా ఇతర వాహనాలు కూడా దెబ్బ తిన్నాయి. ఆ గన్ పౌడర్ పేలుడుకు ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అనుకుంటూ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. ఏఎస్సై ఆంజనేయ రెడ్డి సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ మద్దయాచ్చారి, తహసీల్దారు ఇన్బనాథన్‌, ఎస్సై శ్రీనివాసరావు తదితర అధికారులు వచ్చి స్టేషన్ ను పరిశీలించారు. దీనిపై డీఎస్పీ మాట్లాడుతూ.. స్టేషన్‌ వెనుక వైపు పూడ్చి పెట్టిన 250 గ్రాముల గన్‌ పౌడర్‌ ప్రమాదవశాత్తూ పేలిపోయిందని తేల్చారు. 

అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ గాయాలు కాలేదని తెలిపారు. మర్రిచెట్టు కింద నీడ ఉండటంతో అక్కడ మధ్యాహ్నం వేళల్లో పోలీసులు, స్టేషన్‌కు వచ్చిపోయేవారు, వేచి ఉండేవారు ఉంటుంటారు. అదే పేలుడు పగటిపూట జరిగి ఉంటే ప్రాణ నష్టం బాగా జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget