అన్వేషించండి

TTD News: టీటీడీలో సంచలనం - వైసీపీ హయాంలో పరకామణిలో రూ.100 కోట్ల దొంగతనం - వీడియోలు వైరల్

TTD Parakamani: టీటీడీ పరకామణిలో వంద కోట్ల దొంగతనం జరిగిందని బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ దొంగతనం సీసీ కెమెరా దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Bhanuprakash Reddy alleges theft of Rs 100 crore in TTD Parakamani:  తిరుమల తిరుపతి దేవస్థానం  బోర్డు సభ్యుడు మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి. భానుప్రకాష్ రెడ్డి,  శ్రీవారి హుండీ డబ్బు లెక్కించే విభాగం పరకామణిలో రూ.100 కోట్లకు పైగా దొంగతనం జరిగినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 ఏప్రిల్‌లో జరిగిన ఒక చిన్న దొంగతనం ద్వారా బయటపడిన ఈ కుంభకోణం, గత వైఎస్ఆర్‌సీపీ హయాంలో  కుట్రగా భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.  

భానుప్రకాష్ రెడ్డి ఆరోపణల ప్రకారం, 2023 ఏప్రిల్ 29న టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగం సిబ్బంది, పెద్ద జీయర్ మఠంలో క్లర్క్‌గా పని చేసే   సి.వి. రవి కుమార్‌ను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. పరకామణి హాల్‌లో శ్రీవారి హుండీ  దానాలు లెక్కించే పనిలో  మఠం ప్రతినిధిగా ఉన్న  రవి కుమార్, విదేశీ కరెన్సీ  900 డాలర్లు, సుమారు రూ.72,000 ను తన ఇన్నర్ వేర్‌లో దాచుకుని బయటకు వెళ్తుండగా  తనిఖీల్లో పట్టుబడ్డాడు.  వెంటనే  తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.  మే 30, 2023కి చార్జ్‌షీట్ ఫైల్ చేశారు.  తిరుపతిలోని II అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో విచారణ జరిగింది.

అయితే మే 19, 2023కి రవి కుమార్ చెన్నై, తిరుపతిలోని 7 ప్రధాన ఆస్తులను టీటీడీకి రాసిచ్చారు. వీటి విలువ కోట్లలో ఉంటుంది.  ఆ తర్వాత, సెప్టెంబర్ 9, 2023న లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుని కేసు క్లోజ్ అయింది. ఈ ప్రాసెస్ టీటీడీ లా డిపార్ట్‌మెంట్ ద్వారా  కాకుండా, మాజీ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ చేత జరిగింది.   తాను పోలీసు అధికారుల ఒత్తిడికి లొంగి ఈ  రాజీ చేశానని సతీష్ కుమార్ వాంగ్మూలం ఇచ్చాడు. ఓ చిన్న క్లర్క్ కు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయని  దీని వెనుక పెద్ద  ముఠా ఉందని భానుప్రకాష్ రెడ్డి అంటున్నారు.  

రవికుమార్ ఆస్తులు కొన్నింటిని టీటీడీకి రాసిచ్చి.. వందల కోట్ల ఆస్తులు వైసీపీ నేతలు రాయించుకున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. నారా లోకేష్ కూడా ఈ అంశంపై స్పందించారు.   అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూని కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు. ఏడుకొండల జోలికి వెళ్ళవద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దు అని.. నాడు జగన్మోహన్ రెడ్డికి బతిమాలి చెప్పారు చంద్రబాబు గారు.. అయినా వినలేదు. ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ సామీ.. ఆయనకు అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా.. ఏం జరుగుతుందో తెలిసినా జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారని.. నిందితులే పాపాల చిట్టా విప్పబోతున్నారని ప్రకటించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Telangana Panchayat Elections: ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Film Prediction 2026: దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
Advertisement

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Telangana Panchayat Elections: ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Film Prediction 2026: దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
Type-2 Diabetes Risk : స్వీట్స్ కాదు.. రోజూ తింటున్న ఈ ఫుడ్స్‌ వల్లే షుగర్ పెరుగుతుందట, నిపుణుల హెచ్చరికలు ఇవే
స్వీట్స్ కాదు.. రోజూ తింటున్న ఈ ఫుడ్స్‌ వల్లే షుగర్ పెరుగుతుందట, నిపుణుల హెచ్చరికలు ఇవే
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Tata Sierra: హ్యుందాయ్ క్రెటాకు పోటీగా వచ్చిన టాటా సియెర్రా.. ధర, స్పేస్, ఇతర ఫీచర్లు
హ్యుందాయ్ క్రెటాకు పోటీగా వచ్చిన టాటా సియెర్రా.. ధర, స్పేస్, ఇతర ఫీచర్లు
Rahu : రాహువు గ్రహం కాదు, మీ జీవితానికి అదృశ్య ఎడిటర్! మీ విధిని మార్చే ఆటగాడు! ఎలానో తెలుసా?
రాహువు గ్రహం కాదు, మీ జీవితానికి అదృశ్య ఎడిటర్! మీ విధిని మార్చే ఆటగాడు! ఎలానో తెలుసా?
Embed widget