అన్వేషించండి

TTD Latest: తిరుమలలో ప్రతి మంగళవారం అష్టదళ పాదపద్మరాధన సేవ ఎలా చేస్తారు? విశిష్టత ఏంటంటే

TTD News: శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ సాధారణ స్ధితికి చేరుకుంది. ఇక ప్రతి మంగళవారం అష్టదళపాద పద్మరాధన‌ సేవను 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడమే ఈ సేవ విశేషం. సోమవారం 29-08-2022 రోజున 67,950 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 31,407 మంది తలనీలాలు సమర్పించగా, 5 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా, స్వామి వారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవ విశేషం. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు.

సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Embed widget