News
News
X

Anantapur News: సీమలో కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి పర్యటన- అభ్యంతరం చెప్పి అడ్డుకుంటున్న టీడీపీ, సీపీఐ నేతలు

Anantapur News: ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపై అనంతపురంలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు దాడికి యత్నించారు. విధులు నిర్వహిస్తుండగా.. వెళ్లిన టీడీపీ, సీపీఐ నేతల దాడి చేశారు. 

FOLLOW US: 
Share:

Anantapur News: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. అధికార పార్టీ తరఫున పలువురు ఉన్నతాధికారులే రంగంలోకి దిగారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగా జిల్లాల్లో ఉపాధ్యాయలతో ఇతర అధికారులతో సమావేశమై ఒత్తిడి తీసుకొస్తున్నారని మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాయలసీమలో పర్యటిస్తున్న ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి కొందరు నేతలు అడ్డుకోవడం కలకలం రేపింది. 

అనంతపురంలో ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి పర్యటన వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. పదో తరగతిలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు, నాడు - నేడ పనుల పర్యవేక్షణకు పర్యటిస్తున్నారని అధికార పార్టీ చెబుతోంది. అయితే ఇదంతా అబద్దమని.... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆయన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై... అధికార పార్టీకి ఓటు వేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతి పక్షాలు. అందులో భాగంగానే ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి పర్యటనను అనంతపురంలో విపక్షాకలకు చెందిన కార్యకర్తలు అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి భర్త, విద్యాశాఖ కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ రెడ్డిపై దాడికి యత్నించారని అధికార పార్టీ నేతలు. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులతో మాట్లాడుతుండగా.. టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాల నేతలు ఒక్కసారిగా అక్కడికి వచ్చి ఆయన్ని నిలదీశారు. 

ఇంతలో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.  ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిని నిలదీసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తనను హత్య చేసేందుకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారని.. పలువురు ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారంతో బయటపడ్డానని కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. తనపై అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చని.. ఇలా దౌర్జన్యానికి దిగడం అప్రజాస్వామికం అని అన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Published at : 17 Feb 2023 10:00 AM (IST) Tags: AP News AP Politics Attack on RJD Pratap Reddy RJD Pratap Reddy

సంబంధిత కథనాలు

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - ఇవాళ్టి నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీ

Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - ఇవాళ్టి నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీ

తెలంగాణలో పగలు ఎండలు మండే- సాయంత్రం పిడుగులు పడే

తెలంగాణలో పగలు ఎండలు మండే- సాయంత్రం పిడుగులు పడే

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Lokesh on Sand Mafia: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఇసుక దందా ఆరోపణలు, టిప్పర్ల ముందు లోకేష్ సెల్ఫీలు వైరల్

Lokesh on Sand Mafia: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఇసుక దందా ఆరోపణలు, టిప్పర్ల ముందు లోకేష్ సెల్ఫీలు వైరల్

టాప్ స్టోరీస్

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి