Minister Peddireddy : లిక్కర్ స్కాంలో సీఎం కుటుంబ సభ్యులపై ఆరోపణలు, ప్రతిపక్షాలకు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్
Minister Peddireddy : లిక్కర్ స్కాంపై సీఎం జగన్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో ఇసుక స్కాం జరిగిందని ఆరోపించారు.
Minister Peddireddy : లిక్కర్ స్కాంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ మంచి కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ 98.44 శాతం హామీలు అమలు చేశారని, కళ్యాణమస్తు, షాదీ తోపా ప్రకటించిన వెంటనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హాయంలో ఇసుక అక్రమాలపై ఎన్జీటీ రూ.100 కోట్ల ఫైన్ వేసిందని స్పష్టం చేశారు.
లిక్కర్ స్కాంలో రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీ తీసుకు వచ్చి జేపీ గ్రూప్ ద్వారా ఇసుక అందిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. కాంట్రాక్ట్ ను సబ్ కాంట్రాక్ట్ ఇవ్వచ్చనే నిబంధన ఉందని, ఇది తెలియని లోకేశ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజినల్ విజిలెన్స్ స్వాడ్ ఇసుక అక్రమ రవాణాపై నిత్యం పర్యవేక్షిస్తోందన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 15400 ద్వారా అక్రమ రవాణా నిరోధిస్తున్నట్లు వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 98.44 అమలు చేస్తున్నామని, లిక్కర్ స్కాంలో దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. నోటుకు ఓటు స్కాంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు అందరికీ తెలుసుని, లిక్కర్ స్కాంలో జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల పై అసత్య ఆరోపణలు చేయడం సరైనా విధానం కాదన్నారు.
తెలంగాణ రూ.6 వేల కోట్ల బాకీ
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఇసుకపై రూ. 4 వేల కోట్లు దోచుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కాంకు సంబంధించి సీఎం కుటుంబ సభ్యులపై ఆరోపణ చేయడం దుర్మార్గమన్నారు. విభజన తర్వాత తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసిన దానికి రూ.ఆరు వేల కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఈనెల 22న సీఎం జగన్ మోహన్ రెడ్డి కుప్పం పర్యటన ఉందని, చేయూత పథకం కుప్పం నుంచి మహిళలకు అందిస్తారన్నారు. 50 లక్షలు టన్నులు ఇసుక వర్షాకాలంలో నాలుగు నెలలు సమయానికి నిల్వలు ఉంచామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఓటుకు నోటు కేసు
"ప్రభుత్వంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు తన అనుచరులకు వేల కోట్లు దోచిపెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక పేరుతో దోచుకున్నారు. ఇసుక కాంట్రాక్టు, మైనింగ్ విషయంలో వైసీపీ ప్రభుత్వం పారదర్శకంగా కేటాయిస్తుంది. మేనిఫెస్టోలో హామీలు ఆన్ లైన్ పెట్టి తీసేసిన వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ 98 శాతానికి పైగా హామీలు అమలు చేశారు. నిత్యం ప్రభుత్వంపై ఏదో విధంగా బురదజల్లాలని చూస్తున్నారు. దిల్లీ లిక్కర్ స్కాంతో ఏపీకి సంబంధం ఏంటి? ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఏపీ పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు"- మంత్రి పెద్దిరెడ్డి
Also Read : Tammineni Seetharam : చంద్రబాబు ఓ క్రిమినల్, అదొక ఉన్మాద యాత్ర- స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు
Also Read : Maha Padayatra: రేపటి నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర