News
News
X

Tammineni Seetharam : చంద్రబాబు ఓ క్రిమినల్, అదొక ఉన్మాద యాత్ర- స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు

Tammineni Seetharam : అమరావతి రైతుల పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుని తీరుతామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇది ఉత్తరాంధ్రపై జరుగుతున్న దండయాత్ర అని ఆరోపించారు.

FOLLOW US: 

Tammineni Seetharam : ఎన్నికల హామీల్లో 98.44 శాతం పూర్తి చేసిన ఏకైన నేత సీఎం జగన్ అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన  ఒక రాజకీయ పార్టీకి విశ్వసనీయత మేనిఫెస్టో  అన్నారు.  గత ప్రభుత్వం 612 హామీలు ఇచ్చి, ఆన్ లైన్ పెట్టారని జనాలు ప్రశ్నిస్తున్నారని ఆన్ లైన్ నుంచి తొలగించారని విమర్శించారు. ప్రజలకు మాట ఇచ్చి మాట తప్పుని నేత చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చరిత్ర కారుడా? చరిత్ర హీనుడా? అని ప్రశ్నించారు. కళ్యాణమస్తు, షాదీ తోఫా అక్టోబర్ 1 నుంచి ప్రారంభిస్తున్నామని తమ్మినేని సీతారాం తెలిపారు.  బీసీ, ఎస్సీ , ఎస్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు సర్కార్ బాసటగా నిలబడుతుందన్నారు.  ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు, ఎస్సీల కులాంత వివాహాలకు లక్షా ఇరవై వేలు ఇస్తున్నామన్నా్రు. మేనిఫెస్టోకి కట్టుబడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్  అన్నారు.  

ఇది అసమర్థుడి అంతిమయాత్ర 

 "ఉత్తరాంధ్రపై జరిగేది పాదయాత్ర లేదా దండయాత్రా? లేక అసమర్థుని అంతిమయాత్రా?. కేవలం హైదరాబాద్ అని మొత్తం ఆదాయాన్ని డంప్ చేశారు. నాడు రాయలసీమ , ఉత్తరాంధ్రను నెగ్లెట్ చేశారు. ఒకే దగ్గర కేంద్రీకృతం కావడంతో తెలంగాణ ఉద్యమం వచ్చింది. హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా వెనకబడ్డాయి. ఏపీ మరోసారి వేర్పాటువాదులతో పోరాడే అవకాశం లేదు. ఏపీని మూడు రాజధానులుగా విభజించడం వెనుక దూరదృష్టి ఉంది. రాష్ట్ర ప్రజలకు సమగ్ర అభివృద్ధి, సంక్షేమం అందాలని మూడు రాజధానుల నిర్ణయం. మూడు ప్రాంతాలకు ముడు రాజధానులంటే చంద్రబాబుకు ఏంటి సమష్య.  చంద్రబాబు సమస్య అంతా ఒకే సామాజిక వర్గానికి  భూములు కట్టబెట్టడమే. రండి అంతా ఒకే దగ్గర పెడదామని భూములు కట్టబెట్టారు."- చంద్రబాబు

చంద్రబాబు ఓ క్రిమినల్ 

ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చెప్పే యాత్ర ఇదని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర , రాయలసీమ తల్లడిల్లిపోతుంటే తమ ఉసురు పోసుకుంటారన్నారు. రాజధాని పేరుతో దోపిడీ సాగించేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు బతకాలా? వద్దా అని సీతారాం ప్రశ్నించారు.  అమరావతిలో రాజధాని పెట్టి ఘోర నేరం చేశారన్నారు.  చంద్రబాబు ఓ క్రిమినల్ అని విమర్శించారు. ఓటుకి నోటు కేసుకి భయపడి అర్థరాత్రి అమరావతికి వచ్చారని ఆరోపించారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి చేస్తున్న  దండయాత్ర అమరావతి పాదయాత్ర అని విమర్శించారు. ఇదొక ఉన్మాద యాత్ర అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు ఏం వద్దని చేస్తున్న యాత్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.   అమరావతి టు అరసవల్లి యాత్రను అడ్డుకొని తీరుతామన్నారు. అశాంతికి  చంద్రబాబే కారణం అవుతారన్నారు. ఉసిగొల్పినప్పుడు బానే ఉంటుంది, ఉసురు పోసుకున్నప్పుడు బాధ తెలుస్తుందని ఆరోపించారు.ఉద్యమం పేరుతో యథేచ్చగా వసూళ్లు చేసుకుంటున్నారని ఆక్షేపించారు.   

చంద్రబాబు కుట్రలో భాగమే 

"ఈ వయసులో చంద్రబాబు పాదయాత్ర చేయలేరు. లోకేశ్ పాదయాత్ర చేసినా జనం విశ్వసించరు. అందుకే అమరావతి రైతుల పేరిట చంద్రబాబు పరోక్షంగా పాదయాత్ర చేయిస్తున్నారు. అమరావతి రైతుల పేరిట జరిగే పాదయాత్రలో జరిగే పరిణామాలకు చంద్రబాబు బాధ్యత వహించాలి. అమరావతి ప్రజలకు ఉత్తరాంధ్ర ప్రజలకు ఎలాంటి విద్వేషాలు లేవు.  అందరూ తెలుగువారే. రాజకీయాల కోసం చంద్రబాబు కుట్రలో భాగమే ఈ అమరావతి రైతుల యాత్ర. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే విశాఖ, కర్నూలు, అమరావతిలను సీఎం జగన్  రాజధానిగా గుర్తించారు, ఎన్ని అవాంతరాలు సృష్టించినా మూడు రాజధానుల ప్రక్రియ ముందుకు వెళుతుంది,". - మంత్రి విడదల రజిని

Published at : 11 Sep 2022 08:07 PM (IST) Tags: AP News Padayatra Amaravati Farmers Chandrababu Srikakulam news Tammineni seetharam

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు

CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

టాప్ స్టోరీస్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Rashmika Mandanna: ‘నేషనల్ క్రష్’ స్టన్నింగ్ లుక్స్

Rashmika Mandanna: ‘నేషనల్ క్రష్’ స్టన్నింగ్ లుక్స్