Tirupati: Tirupati: డిసెంబరు 27న శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల
జనవరి నెల సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఈ నెల 27న విడుదల చేయనుంది. జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు, మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేలు చొప్పున టోకెన్లు విడుదల చేయనున్నారు.
జనవరి నెలకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను డిసెంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వైకుంఠ ఏకాదశి(వైకుంఠ ద్వార దర్శనం) పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేలు చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ తెలిపింది.
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?
శ్రీవారి దర్శనానికి ఇవి తప్పనిసరి
తిరుమలలో శ్రీవారి దర్శనానికి కోవిడ్ రెండు డోసుల వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపింది. ఇప్పటికే టీటీడీ ఈ విషయాన్ని తెలియజేసిందని పేర్కొంది. కొంతమంది భక్తులు నెగెటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేసి అటువంటి వారిని వెనక్కి పంపిస్తామన్నారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 మార్గదర్శకాలు జారీచేసింది. కచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూపించిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది. భక్తులు ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలని కోరారు. టీటీడీకి సంబంధించిన ఇతర ఆలయాల్లో ఈ కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని భక్తులను కోరారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయని టీటీడీ పేర్కొంది. టీటీడీకి చెందిన ఇతర ఆలయాల్లో కూడా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
Also Read: స్వామీ.. కోర్టుకెళ్లి తేల్చుకుందామా ? టీటీడీపై మళ్లీ ట్వీటెత్తిన రమణదీక్షితులు !
టీటీడీ వెబ్ సైట్ కు 14 లక్షల హిట్లు
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. జనవరి నెలకు సంబంధించి టీటీడీ శుక్రవారం 4 లక్షల 60 వేల దర్శనం టోకెన్లు విడుదల చేసింది. ఈ టికెట్లు హాట్‌కేకుల్లా బుక్ అయ్యాయి. ఒక్కసారిగా దర్శనం టిక్కెట్ల కోసం టీటీడీ వెబ్‌సైట్‌కు 14 లక్షల హిట్లు వచ్చాయి. ఏకంగా 55 నిమిషాల్లో 4 లక్షల అరవై వేల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈ స్థాయిలో టీటీడీ వెబ్ సైట్ కు హిట్లు ఒకేసారి రావడం ఇదే మొదటిసారని తెలుస్తోంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి