అన్వేషించండి

Tirumala News : తిరుమలలో సాధారణ స్థితికి భక్తుల రద్దీ, ఆదివారం శ్రీవారి పూజలు ఇవే!

Tirumala News : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. నిన్న 80 వేల మంది శ్రీవారిని దర్శించకున్నారు. ఆదివారం స్వామి జరిగే పూజల వివరాలు ఇలా ఉన్నాయి.

Tirumala News : ఏడు కొండల్లో భక్తుల రద్దీ సాధారణ స్ధితికి చేరుకుంది. శనివారం 79,836 మంది స్వామి వారి దర్శించుకున్నారు. నిన్న స్వామి వారికి 35,916 మంది తలనీలాలు సమర్పించగా, 4.56 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి‌ ఉండగా, స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.  

ఆదివారం సేవలు 

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారాన్ని తెరిచి వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలిదర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు అర్చకులు. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ చేస్తారు. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు. 

నవనీత హారతి 

శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తరువాత గొల్ల హారతి సమర్పిస్తారు. తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థాన్ని అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి,తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేసిన అర్చకులు తోమాల సేవ ప్రారంభిస్తారు. ముందుగా ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు తిరుమంజనం నిర్వహిస్తారు.  అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం,అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. తర్వాత వక్షఃస్ధల లక్ష్మీ ,పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి, సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. ఈ తంతుతో తోమాల సేవ పూర్తి అవుతుంది. తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో కొలువు శ్రీనివాసమూర్తి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు.  

1008 నామాలు పఠనం

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామివారికి నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేసి, సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేద్యంలో అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు.  సన్నిధిలో శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహించిన సర్కారు వారి హారతి జరిపి వీఐపీ బ్రేక్‌ దర్శనం భక్తులను అనుమతిస్తారు.  శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విమాన ప్రకారం ప్రదక్షిణ దిశగా చేస్తూ కళ్యాణోత్సవ మండపానికి వేంచేపు చేసి, స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం కార్యక్రమం  శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అర్చకులు. శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అటు తరువాత సహ్రదీపాలంకరణ సేవ నిర్వహించిన‌ అర్చకులు, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయానికి చేరుకున్న అనంతరం సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు అర్చకులు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల, రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు. 

టీటీడీ విజ్ఞప్తి 

శ్రీనివాసుడి దర్శనం కోసం తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు అలిపిరి‌ నడక మార్గం, శ్రీవారి నడక మార్గం, తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమలకు చేరుకోవచ్చు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులు ముందుగా సీఆర్వో కార్యాలయం వద్ద వసతి గదులు పొంది, స్వామి వారికి తలనీలాలు సమర్పించి స్వామి వారి దర్శన భాగ్యం పొందే అవకాశం కల్పిస్తోంది టీటీడీ. ఇక యాత్రికుల సౌకర్యార్ధం తిరుమలలో ప్రధాన ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లతో పాటుగా ,మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. అదే విధంగా భక్తులకు కోరినన్ని లడ్డూలను భక్తులకు టీటీడీ అందిస్తోంది. తిరుమల యాత్రతో పాటుగా వివిధ యాత్ర ప్రదేశాలు భక్తులు సందర్శించేందుకు బస్సు సౌకర్యం కల్పించింది టీటీడీ. తిరుమలలో అధిక రద్దీ కారణంగా భక్తులు ఓపికగా స్వామి వారి దర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. 

Also Read : CJI Justice NV Ramana: యూనివర్సిటీలో క్యాంటీనే మా అడ్డా - సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandramouli Last Rites: విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
Chandramouli Last Rites: విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
CM Chandrababu: నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandramouli Last Rites: విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
Chandramouli Last Rites: విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి, ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారు స్వాతంత్య్ర సమరయోధులు- పాక్ డిప్యూటీ ప్రధాని సంచలనం
Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
CM Chandrababu: నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
Indus Water Treaty: సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
Allu Arjun: అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్ - రూ.1.2 కోట్ల వాచ్‌తో స్టైలిష్‌గా.. అట్లీ మూవీ కోసమేనా?
అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్ - రూ.1.2 కోట్ల వాచ్‌తో స్టైలిష్‌గా.. అట్లీ మూవీ కోసమేనా?
ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?
ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?
PV Sunil Kumar : పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ -  మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ - మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
Embed widget