Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, సెప్టెంబర్ 21న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
Tirumala Darshan Tickets : నవంబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక్య ప్రవేశ దర్శనం టికెట్లను సెప్టెంబర్ 21న టీటీడీ విడుదల చేయనుంది.
Tirumala Darshan Tickets : నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం టీటీడీ విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను సెప్టెంబరు 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ నెలలో శ్రీవారికి నిర్వహించనున్న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత సేవా టికెట్లను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 21న అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. అక్టోబర్ నెలకు సంబంధించి పొర్లుదండాలు టికెట్లను సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండడంతో ఈ తేదీలకు సంబంధించి ప్రదక్షిణం టోకెన్లు రద్దు చేశారు. భక్తుల ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది అత్యంత వైభవంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ గరుడ వాహన సేవ నిర్వహిస్తామని, రెండేళ్ల అనంతరం తిరుమాఢ విధుల్లో జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాకు వచ్చామని పేర్కొంది.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్
- సెప్టెంబరు 27 - సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం
- సెప్టెంబరు 28 - ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ
- సెప్టెంబర్ 29 - ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సింహ వాహనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం
- సెప్టెంబర్ 30 - ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం
- అక్టోబర్ 1 - ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుంచి గరుడ వాహన సేవ
- అక్టోబర్ 2 - ఉదయం 8 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవ
- అక్టోబర్ 3 - ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం
- అక్టోబర్ 4 - ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహన సేవ
- అక్టోబర్ 5 - ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణం
Also Read : Tirumala Brahmotsavam 2022: ఈ నెల 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఈవో ధర్మారెడ్డి