అన్వేషించండి

BRS Meeting In Vizag: కేసీఆర్‌తో భారీ బీఆర్ఎస్ సభ విశాఖపట్నంలో - తోట చంద్రశేఖర్ వెల్లడి

రఘునందన్ రావు తనపై చేసిన ఆరోపణలను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఖండించారు.

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఖండించారు. తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, చిల్లర రాజకీయాల కోసమే నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రశేఖర్ అన్నారు. ఖమ్మంలో నేడు జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ నుంచి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికే పనికిమాలిన ఆరోపణలు చేస్తు్న్నారని విమర్శించారు. రఘునందన్ రావు చేస్తున్న ఆరోపణలు నిజమైతే.. ఆ సర్వే నెంబర్ భూమిలో 90 శాతం తననే తీసుకోమని, మిగిలిన 10 శాతాన్ని తనకు ఇవ్వమని అడిగారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర కీలకం కాబోతోంది. తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే సీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో అమలు అవుతున్న ప్రగతిని దేశానికి పరిచయం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే తేదీని ఖరారు చేస్తాం’’ అని తోట చంద్రశేఖర్ మాట్లాడారు.

ఖమ్మం బీఆర్ఎస్ సభ తర్వాత ఏపీకి చెందిన పెద్ద నేతలు బీఆర్ఎస్‌లో చేరతారని తోట చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటికే చాలా పెద్ద పెద్ద నేతలు తమను కలుస్తున్నారని తెలిపారు. ఖమ్మం సభ తర్వాత భారీ చేరికలు ఉంటాయని చెప్పారు. రైతు బంధు, దళిత బంధు, రైతు రుణ మాఫీ వంటి పథకాలు దేశంలోనే ఓ మోడల్ గా ఉన్నాయని అన్నారు. 

ఇటీవలే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రేశఖర్ ను కేసీఆర్ నియమించారు. అంతకు ముందు ఆయన ఐఏఎస్ ఆఫీసర్. మహారాష్ట్ర క్యాడర్‌లో పని చేసేవారు. వీఆర్ఎస్ తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తన కుమారులతో కలిసి ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ అనే కంపెనీ నడుపుతున్నారు. ఈ కంపెనీనే మియాపూర్ భూముల్ని కొన్నారని.. రఘునందన్ ఆరోపిస్తున్నారు. 

రఘునందన్ ఆరోపణలు ఇవీ

భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా ఇటీవల ప్రకటించిన తోట చంద్రశేఖర్‌కుచెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి రూ. 4 వేల కోట్ల రూపాయల మియాపూర్ భూములను అప్పగించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ సీఎస్  సోమేష్ కుమార్ కనుసన్నలోనే మియాపూర్ భూకుంభకోణం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు.  ఖమ్మం సభకు ఆర్థికవనరులు ఎక్కడ నుంచి వస్తున్నాయో చెప్పాలని హైదరాబాద్‌లో నిర్వహించన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఉద్యమంలో రాక్షసులైన ఆంధ్రోళ్ళు ఇప్పుడు రక్తసంబంధీలు ఎలా అయ్యారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.  తోట చంద్రశేఖర్ కు 40ఎకరాల మియాపూర్ భూములు కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్ర ఉందన్నారు. 

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మియాపూర్ లో  సర్వే నంబర్ 78 లో40 ఎరాలు కొన్నారని ... దాదాపు 4 వేల కోట్ల విలువైన తెలంగాణ భూముల్ని కేసీఆర్  తోట చంద్రశేఖర్ కు అప్పగించారన్నారు. మియాపూర్ లో వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై   సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేసిన  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్..  తోట చంద్రశేఖర్ భూములపై  ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని ప్రశ్నించారు.  వ్యాపార వేత్త సుఖేశ్ గుప్తాకు ఓ న్యాయం.. తోట చంద్రశేఖర్ కు ఓ న్యాయమా అని నిలదీశారు. తోట చంద్రశేఖర్ 40 ఎకరాలు అమ్మి 4 వేల కోట్లు సంపాదించారని రఘునందన్ ఆరోపించారు. భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని  విమర్శించారు. మియాపూర్  భూములతో లాభపడిన తోట చంద్రశేఖర్ రేపు జరగబోయే ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమేనని విమర్శించారు. 

టాప్ హెడ్ లైన్స్

Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget