Vizag Steel Profits : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రికార్డు స్థాయి లాభాలు ! ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకుంటారా ?
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు భారీ లాభాలు వచ్చాయి. కేంద్ర ఉక్కు శాఖ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు ఉన్నాయి.
ప్రైవేటీకరణ బాటలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ రికార్డు స్థాయి లాభాలు ఆర్జిస్తోది. గత ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలాను ఆర్జించింది. పెద్ద ఎత్తున నష్టాల కారణంగా ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్రం చెబుతోంది కానీ.. స్టీల్ ప్లాంట్‌కే కాదు ఆ ప్లాంట్ వల్ల ఇతర వ్యాపారాలకు పెద్ద ఎత్తున లాభం వస్తోందని కేంద్రం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడయింది.
విజయవాడలో విషాదం - కొన్న 24 గంటల్లోనే పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ, ఒకరి మృతి
గత ఏడాది ఏప్రిల్- డిసెంబర్ మధ్యకాలంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఎన్‌పీఎల్)కు పన్నుకు ముందు రూ.946 కోట్లు, పన్ను తర్వాత రూ.790 కోట్లకు పైగా నికర లాభం వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ముడి ఉక్కు ఉత్పత్తిలో 47%, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తిలో 75% వృద్ధి సాధించింది. 10 లక్షల టన్నుల ఉక్కును ఎగుమతి చేసి రూ.4,572 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది కంటే ఇది 45% అధికంమని కేంద్ర ఉక్కు శాఖ నివేదిక తెలిపింది. .
ఇంట్లోనే చితి పేర్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు! ఫ్యామిలీ షాకింగ్ నిర్ణయం - చివరికి
విశాఖ స్టీల్ 2021-22లో డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు రూ.2,170 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.331 కోట్ల ఆదాయాన్ని చేకూర్చింది. వందశాతం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఈ కంపెనీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ రూ.8 వేల కోట్లు. సబ్‌స్క్రైబ్డ్, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ డిసెంబర్ 31 నాటికి రూ.4,889 కోట్లుగా ఉంది. భారతీయ రైల్వే అవసరాలు తీర్చడానికి ఆర్‌ఐఎన్‌ఎల్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని లాల్‌గంజ్‌లో ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్థాయిలో ఉందని కేంద్రం తెలిపింది.
అందరూ చూస్తుండగా పట్టపగలే కిడ్నాప్, మరుసటిరోజు ఉదయం శవమై కనిపించిన ఎగ్జిక్యూటివ్ !
ఇంత భారీ స్థాయిలో లాభాలు ఆర్జిస్తుంది కాబట్టి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకునే ఆలోచన ఉందా అంటే.. అసలు అలాంటి చాన్సే లేదని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కొనేవాళ్లు ఎవరూ రాకపోతే మూసేస్తాం కానీ నడిపించే ప్రశ్నే లేదని చెబుతోంది. అయితే కార్మిక సంఘాలు మాత్రం ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలని ఉద్యమం కొనసాగిస్తున్నాయి.
కేంద్ర ఉక్కు శాఖ పూర్తి స్థాయి నివేదికను ఈ లింక్‌లో చూడవచ్చు. https://steel.gov.in/sites/default/files/Download_0.pdf