అన్వేషించండి

BJP Vishnu :టిప్పుసుల్తాన్ విగ్రహ స్థానంలో పటేల్ స్టాట్యూ - దమ్ముంటే ఆపాలని వైసీపీకి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ !

Tippu Statue Controversy : అనంతపురంలో టిప్పుసుల్తాన్ విగ్రహ వివాదం కొత్త మలుపు తిరిగింది. అదే ప్లేస్‌లో పటేల్ విగ్రహం పెడతామని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేశారు.


BJP Vishnu On Tippu Statue :  అనంతపురం లో వైసీపీ  బీజేపీ మధ్య విగ్రహం విషయంలో రాజకీయ దుమారం రేగుతోంది.  అనంతపురం నగరంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతామని  అధికారులకు దరఖాస్తు  చేసుకున్నామని..  అధికారుల నుంచి అనుమతి రాలేదు కానీ..  ఇంతలో కొంతమంది వైకాపా నేతల ప్రోత్సాహంతో ఉద్దేశపూర్వకంగా టిప్పు విగ్రహం పెట్టడానికి భూమిపూజ చేశారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. ఆనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన..  వైసీపీ నాయకులకు ఒక ఛాలెంజ్ విసిరారు.  వల్లభాయ్ పటేల్, టిప్పు సుల్తాన్ విగ్రహాల విషయంలో ప్రజాభిప్రాయం తీసుకుందామని...  ఎవరి విగ్రహం కావాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 

టిప్పు సుల్తాన్ విగ్రహ శంకుస్థాప చేసిన చోటే పది రోజుల్లో పటేల్ విగ్రహం
 
కొంతమంది స్వార్థ రాజకీయల కోసం విగ్రహాల మీద రాజకీయం చేస్తున్నారని విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు.  ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కొంతమంది చూస్తున్నారని..  ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగులో శాంతి భద్రతల ఘర్షణ వాతావరణం ఏర్పడే విధంగా  వైసీపీ చేస్తోందని విమర్శించారు.  వైకాపా పార్టీ కేంద్ర కార్యాలయం సూచనతో చేస్తున్నారున్నారు.  10 రోజుల్లో  బీజేపి అదే స్థలంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతామని సవాల్ చేశారు.  ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు. 

వైసీపీ టిక్కెట్ కోసమే రాజకీయాలు 

 అనంతపురం అర్బన్ వైసీపీ టికెట్ కోసం విగ్రహాల వివాదం తెరమీదకు తెచ్చారని..  మీ టికెట్ పంచాయితీ తాడేపల్లి లో తేల్చుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.  ప్రశాంతంగా ఉన్న అనంతపురం లో కాదన్నారు.  బీజేపీ పార్టీ తో చేతనైతే రాజకీయంగా తేల్చుకోండి , మా పార్టీ సిద్ధంగా ఉందన్నారు.  గతంలో ప్రొద్దుటూరు లో కూడా వైసీపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలే చేసి విఫలమయ్యారని..టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టాలని ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిఘటించామన్నారు.   ఏపీలో ఎక్కడా లేని టిప్పు సుల్తాన్ విగ్రహం అనంతపురం లో ఎందుకు... కనీసం ఆయన పుట్టిన మైసూర్ లో కూడా లేదు కదా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. 

ఏపీలో కూడా బీజేపీ, జనసేన కూటమికి మంచి ఫలితాలు

 ఏపీ లో కూడా బీజేపీ, జనసేన కు మంచి ఫలితాలు వస్తాయి... మాకు వ్యూహం ఉంది దాని  ప్రకారం ముందుకెళ్తామని విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు.   తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం , కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీ-జనసేన పార్టీలకు వ్యతిరేకంగా పని చేయడం రాజకీయ తప్పిదమన్నారు.  ఏపీ లో తెలుగు దేశం , కాంగ్రెస్ కలిసి పోటీచేస్తున్నట్లు  ప్రచారం చేస్తున్నారనన్నారు. బీజేపీ పొత్తుల అంశం..  మా పార్టీ పొత్తులు అంశం జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని..  తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసి, గాంధీ భవన్ లో టీడీపీ జెండా లో తిరిగిన తెలుగుదేశం ఎపీ లో బిజెపి పార్టీ తో ఎందుకు కలవాలి అనుకొంటారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.  ఈ ప్రశ్నకు చంచంద్రబాబు వారి పార్టీ సమాదానం చెచెప్పాలని..  రాజకీయాల్లో చివరి వరకు ఏమైనా జరగొచ్చన్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Embed widget