అన్వేషించండి

AP SkIll Scam : "స్కిల్‌"లో అవినీతి జరిగితే అప్పటి ఎండీ, నిర్ణయాలు తీసుకున్న ఐఏఎస్‌లను ఎందుకు వదిలేశారు ? ఏపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రశ్న !

ఏపీ ప్రభుత్వం తప్పుడు తప్పుడు కేసులతో బురద చల్లి,సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపించింది. సమాధానం చెప్పాలంటూ కొన్ని ప్రశ్నలను ప్రభుత్వం ముందు ఉంచింది.


ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూ. 243 కోట్ల స్కాం జరిగిందని ఏపీ సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ అంశం బయటకు రాక ముందే ఇందులో ఏ-2గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణ ఇంటిపై సీఐడీ అధికారులు దాడులు చేశారు. రాత్రి రెండున్నర సమయంలో ఆయన ఇంటికి వెళ్లి సోదాలకు ప్ర.యత్నించారు. ఈ అంశం వివాదాస్పదమయింది. సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన బీపీ పడిపోవడంతో స్పృహ తప్పిపోయారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

Also Read : పీఆర్సీ ప్రకటించినా ఉద్యమం ఆగదు... సీపీఎస్ రద్దు చేయకుండా ప్రత్యామ్నాయాలు వద్దు...

ఏపీసీఐడీ నమోదు చేసిన కేసులో ఏ-1గా అప్పటి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న గంటా సుబ్బారావు, ఏ2గా లక్ష్మీనారాయణ పేరును చేర్చారు. మొత్తం 13 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో ఏపీ సీఐడీ చేర్చింది. డిజైన్ టెక్, సిమెన్స్ కంపెనీ పేర్లను ఏ4, ఏ5గా సీఐడీ పేర్కొంది.  విచారణ సందర్భంగా ఆస్పత్రి పాలవడంతో లక్ష్మీనారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 13న విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది.

Also Read:  ఇక కొత్త లేఅవుట్లు వేస్తే 5% స్థలం ఇవ్వాల్సిందే.. లేదా ఇలా చేయొచ్చు, ప్రభుత్వం సంచలన నిర్ణయం

రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మినారాయణ ఇంటిపై సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్దంగా దాడులు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూపాయి కూడా అవినీతి జరగలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని విచారించాలనుకుంటే... డైరక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఆయన ఏ చెల్లింపులకైనా సంతకం పెట్టారా..? ఒక్కడే ఏ నిర్ణయం అయినా తీసుకున్నారా..? బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 

Also Read:  కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ తరపున టీడీపీ హయాంలో 40కిపైగా నైపుణ్య అభివృద్ది కేంద్రాలు సిమెన్స్ నేతృత్వంలో ఏర్పాటు చేశారని.. దానికి ఎండీగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డి చెల్లింపులు చేశారన్నారు. అదే సమయలో రెండు కమిటీలు ఈ మొత్తాన్ని పర్యవేక్షించాయని.. ఆ కమిటీలకు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్,  రావత్‌లు నేతృత్వం వహించారని వారి సిఫార్సుల మేరకే అన్నీ జరిగాయన్నారు. మరి వారి పేర్లను ఎందుకు ఎఫ్‌ఐఆర్‌లో పెట్టలేదని ప్రశ్నించారు. అవినీతి జరిగి ఉంటే వాళ్లనే కదా ప్రశ్నించాలన్నారు.  ప్రేమ్ చంద్రారెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితుడని ఆయనను ఎస్‌ఈసీ పదవికి కూడా సిఫార్సు చేశారన్నారు. 

Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !

అలాగే అజయ్ జైన్, రావత్‌లు ఎప్పుడూ సీఎం ఇంట్లోనే ఉంటారని .. వారిని కాదనుకుంటా... రిటైరైపోయిన .. ఎలాంటి నిర్ణయాధికారం లేని డైరక్టర్ అయిన లక్ష్మినారాయణపై నిందలేసిఆయనను మానసికంగా క్షోభపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని..  ఎలా జరిగిందో చెప్పాలని సవాల్ చేశారు. ఖర్చు చేసిన మొత్తం అవినీతి అయితే స్కిల్ డెలవప్‌మెంట్ సెంటర్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. రాష్ట్రానికి ఏ కంపెనీలు రావడం లేదని..యువతకు ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని.. కక్ష సాధింపుల కోసం ఇలాంటి తప్పుడు కేసులతో మరెవరూ రాకుండా చేస్తున్నారని పట్టాభిరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget