News
News
X

Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !

ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసుల విచారణ జరగనుంది. త్వరగా విచారించాలని ఏపీ ప్రభుత్వ లాయర్ ధర్మాసనాన్ని కోరారు.

FOLLOW US: 
Share:

Supreme Court Amaravati Case :  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల విచారణను ఫిబ్రవరి 23న  చేపడతామని  జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డికి తెలిపింది.  రాజధాని అమరావతి కేసును త్వరితగతిన విచారించాలని సోమవారం ఉదయం సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది మరోసారి విజ్ఞప్తి చేశారు. కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని రైతుల తరపు న్యాయవాదులు తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేయడానికి తమకు కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఈనెల 23న విచారణకు తీసుకుంటామని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం వెల్లడించింది.మామూలుగా అయితే జనవరి 31వ తేదీన విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆరోజు బెంచ్ మీదకు రాలేదు. తర్వాత ఏడో తేదీన విచారణకు లిస్ట్ అయినట్లుగా కంప్యూటర్ జనరేటెడ్ లిస్టింగ్ కనిపించింది.

అయితే అమరావతి రాజధాని కేసులు  తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు ఏపీ ప్రభుత్వం శనివారం లేఖ రాసింది.  ఈ మేరకు వెంటనే మెన్షన్ లిస్ట్‌లో చేర్చాలంటూ రిజిస్ట్రారుకు సుప్రీంకోర్టులోని అడ్వకేట్ ఆన్‌రికార్డ్స్ మెహఫూజ్ నజ్కీ   లేఖ పంపారు. ఈనెల 6న మెన్షన్ లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రారును నజ్కీ అభ్యర్థించారు. కానీ మెన్షన్ కాకపోవడంతో ఏపీ న్యాయవాది ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ వ్యాజ్యంలో నవంబర్ 28న జరిగిన విచారణలో ఈ ఏడాది జనవరి 31కి వాయిదా పడింది. అయితే 31న బెంచ్ సమావేశం కాకపోవడంతో విచారణ జరగలేదు.  

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది.   తదుపరి విచారణ ఏడో తేదీన జరుగుతుందని సుప్రీంకోర్టు వెబ్ సైట్‌లో పేర్కొన్నారు.  మస్తాన్ వలీ అనే  వ్యక్తి కూడా ఏపీ రాజధాని అంశంపై మరో పిటిషన్ దాఖలు చేశారు. శివరమకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని ఖరారు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ  పిటీషన్ ను కూడా కలిపి విచారణకు స్వీకరించనుంది. ఏపీ రాజధాని నగరాన్ని నిర్ధారించే విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని, దీన్ని అమలు చేయాలంటూ మస్తాన్ వలీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పైనా ఒకే సారి విచారణ జరగనుంది. 

మూడు  రాజధానుల అంశం ఏపీలో రాజకీయంగా కలకలం రేపుతోంది. గత గత ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా అమరావతిని ఖరారు చేసింది. ప్రస్తుత సీఎం జగన్ అప్పట్లో ప్రతిపక్ష నేతగా .. అమరావతిని స్వాగతించారు. ఎన్నికల ప్రచారంలోనూ అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత  మూడు రాజధానులని ప్రకటించారు. ఇప్పుడు విశాఖ రాజధానిగా చెబుతున్నారు. 29వేల మంది రైతుల భవిష్యత్ తో సుప్రీంకోర్టు తీర్పు ముడి పడి ఉండటంతో...  అందరి దృష్టి సుప్రీంకోర్టు వైపు ఉంది.  

Published at : 06 Feb 2023 04:27 PM (IST) Tags: Supreme Court Amaravati Cases AP capital case

సంబంధిత కథనాలు

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - సర్వదర్శనానికి 20 గంటల సమయం 

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - సర్వదర్శనానికి 20 గంటల సమయం 

America Jobs: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!

America Jobs: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడ్రోజులు వానలు - వాతావరణ కేంద్రం ఇంకా ఏం చెప్పిందంటే?

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడ్రోజులు వానలు -  వాతావరణ కేంద్రం ఇంకా ఏం చెప్పిందంటే?

YSRCP Fail : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పెక్కడ జరిగింది ? - ఎమ్మెల్సీ ఫలితంపై వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం !

YSRCP Fail : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పెక్కడ జరిగింది ? - ఎమ్మెల్సీ ఫలితంపై వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం !

టాప్ స్టోరీస్

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

రేవంత్‌ హౌస్‌ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు

రేవంత్‌ హౌస్‌ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు

TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్‌ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు 

TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్‌ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు 

Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ

Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ