By: Harish | Updated at : 08 Feb 2023 07:41 PM (IST)
దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే దుర్గ గుడి నూతన పాలక మండలి ప్రమాణస్వీకారం
VJA Durga Temple Politics : బెజవాడ దుర్గగుడి పాలక మండలి ప్రమాణ స్వీకార వ్యవహరం రాజకీయ దుమారాన్ని రాజేస్తోంది. ఇంద్రకీలాద్రి పై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానం పాలక మండలి నియామకం చేయటం,ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే బాధ్యతలను స్వీకరించటం అంతా చక ...చకా జరిగిపోయింది. అయితే ఏపీలో రెండో అతిపెద్ద ఆలయం ట్రస్ట్ బోర్డు ప్రమాణస్వీకారానికి దేవాదాయ శాఖ మంత్రికి ఆహ్వనం అందకపోవడం వివాదానికి కారణం అవుతోంది. స్దానిక ఎమ్మెల్యే , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పని చేసిన వెలంపల్లి శ్రీనివాసరావు అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో సొంత పార్టిలోనే వెలంపల్లి వ్యవహరం చర్చనీయాశంగా మారింది.
ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న వెలంపల్లి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన వారిని ఎంపిక చేసి కమిటిలో స్దానం కల్పించారు.అయితే ఇదే సమయంలో అంతా తానే అన్నట్లుగా వెలంపల్లి వ్యవహరించటం, దేవాదాయ మంత్రిని సైతం లెక్కచేయకుండా, ప్రమాణ స్వీకారానికి కూడ మంత్రిని పిలవకుండా,కార్యక్రమాన్ని పూర్తి చేయటం దుమారానికి కారణం అయ్యింది. గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసిన వెలంపల్లి శ్రీనివాసరావు కు ఆ శాఖ పై పూర్తిగా పట్టు వచ్చింది.అయితే అంతలోనే మంత్రి పదవి నుండి ఆయన్ను తప్పించారు.ఆ తరువాత నూతన మంత్రి వర్గం విస్తరణలో భాగంగా, దేవాదాయ శాఖను కొట్టు సత్యనారాయణ కు ముఖ్యమంత్రి జగన్ అప్పగించారు.
మంత్రిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. వెలంపల్లి జోక్యం చేసుకుంటూ వచ్చారు. తన శాఖలో వెల్లంపల్లి జోక్యం చేసుకోవటం పై కొట్టు సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు.ఇదే విషయాన్ని నేరుగా కొట్టు సత్యనారాయణ, వెలంపల్లితో మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది.తనను కొట్టు సత్యనారాయణ ప్రశ్నించటం పై అసహనం వెలిబుచ్చిన వెలంపల్లి మరింత దూకుడుగా వ్యవహరిస్తూ, తాజాగా దుర్గగుడి కమిటికి సైతం మంత్రి ప్రమేయం లేకుండానే ఏర్పాటు చేసుకునేలా చక్రం తిప్పారని చెబుతున్నారు. .దీంతో ఈ వ్యవహరం పార్టిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
దుర్గగుడి కమిటిలో నియమితులయని వారిలో ఎనిమిది మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన తన అనుచరుడు రాంబాబుకు చైర్మన్ పదవిని వెల్లంపల్లి ఇప్పించారు. అయితే రాంబాబు ఫైనాన్స్ వ్యాపారి ,గతంలో టీడీపీ తరపున పని చేసిన సమయంలో కాల్ మనికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. తరువాత ప్రభుత్వం మారడంతో వైసీపీలో చేరి వెలంపల్లి కి సన్నిహితుడుగా మారారు. పాలక మండలిలో నియమించిన సభ్యులపైనా ఆరోపణలు ఉన్నాయి.
దుర్గగుడి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ఆసక్తికరమయిన మరో ఘటన కూడ వెలుగు చూసింది.ఇటీవల వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భువకుమార్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట శాసన సభ్యుడు,ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను పరస్పరం ఘర్షణ పడటం సంచలనం అయ్యింది. పార్టీలో కూడా ఈ వ్యవహరం తీవ్ర చర్చనీయాశంగా మారింది. అయితే పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను,వె లంపల్లి కలసి పాల్గొన్నారు.వేదిక పై కూడా ఇద్దరు నేతలు పక్క పక్కనే కుర్చొని కార్యక్రమాన్ని నడిపించారు.
Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో
Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు
IPL 2023: బట్లర్ అరాచకం.. 6 ఓవర్లకే రాజస్థాన్ 85/1 - పవర్‌ప్లే రికార్డు!
Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ
NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?