AP Govt Vs Ragurama : ఎంపీ లాడ్స్ నిధులతో చర్చిల నిర్మాణమా ? రఘురామ ఫిర్యాదుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగిన కేంద్రం !
బాపట్ల ఎంపీ తన ఎంపీ ల్యాడ్స్ నిధులను చర్చి నిర్మాణానికి ఇచ్చారన్న ఫిర్యాదుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. ఈ ఫిర్యాదును రఘురామకృష్ణరాజు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎంపీలు తమ ఎంపీ లాడ్స్ నిధులను మత సంబంధిత కార్యక్రమాలకు వాడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. లేఖతో పాటు రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదును కూడా జత చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Also Read : పట్టాభికి బెయిల్ - టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన వారిలో 10 మంది అరెస్ట్ !
ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తుంది. ప్రతి ఏడాది ఈ నిధులను ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం కేటాయించవచ్చు. అయితే ఈ నిధులను ఉపయోగించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. అభివృద్ధి పేరుతో చర్చిల నిర్మాణానికి ఇవ్వకూడదు. ఇలా బాపట్ల నియోజకవర్గంలో ఎంపీ చర్చిల నిర్మాణానికి ఎంపీ లాడ్స్ ఇచ్చారని రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
Also Read : పరిటాల సునీతకు వల్లభనేని వంశీ ఓపెన్ ఛాలెంజ్... అలా చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం...!
ఎంపీ లాడ్స్ నిధులు నేరుగా ఎంపీ ఖాతాకు జమ కావు. రాష్ట్ర ప్రణాళిక విభాగం తరపున మంజూరు అవుతాయి. ఈ కారమంగా రఘురామ ఫిర్యాదు మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించి రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్యకార్యదర్శికి లేఖ పంపింది. ఎంపీలకు కేటాయించిన నిధులతో బాపట్లలో చర్చికి రూ.86 లక్షలు ఖర్చు చేశారన్న ఫిర్యాదుపై పూర్తి స్థాయి వివరాలు పంపాలని కోరింది. చాలాచోట్ల ఇదే తరహాలో ఖర్చు చేశారని ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర స్థాయి నోడల్ విభాగం, జిల్లా అధికారులనూ ఈ అంశంపై వివరణ అడిగింది.
ఎంపీ లాడ్స్ నిధులు మత సంస్థలకు ఖర్చు చేయరాదని..మత సంస్థల పునర్నిర్మాణం, మరమ్మతుకూ వాడకూడదని నిబంధనలు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని కేంద్ర గణాంక శాఖ స్పష్టం చేసింది. ఇలా ఖర్చు చేసి ఉన్నట్లయితే సదరు ఎంపీపై చర్యలు తీసుకుని నిధులను రికవరీ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరణను బట్టి తదుపరి కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో చర్చిలకు ప్రభుత్వ పరంగా నిధులు ఖర్చు పెడుతున్నారని కొంత కాలంగా విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రఘురామకృష్ణ రాజు ఫిర్యాదుపై కేంద్రం స్పందించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది.
Also Read: చంద్రబాబు ఢిల్లీ టూర్ బీజేపీకి దగ్గరవడానికా ? ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా ?